కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరోనా పాజిటివ్-జూన్ 8న ఈడీ విచారణకు ముందు...
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. ఆమెకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెను క్వారంటైన్ కు పంపి చికిత్స అందిస్తున్నారు. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నుంచి సమన్లు అందుకున్న సోనియా గాంధీ.. ఇలా కరోనా బారిన పడటం చర్చనీయాంశమవుతోంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గత వారం రోజులుగా నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. సోనియా గాంధీకి ప్రస్తుతం తేలికపాటి లక్షణాలే ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారని తెలిపారు.

నిన్న సోనియాగాంధీ కలిసిన వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, నిన్న సాయంత్రం సోనియా గాంధీకి తేలికపాటి జ్వరం వచ్చిందని, పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో క్వారంటైన్ లోకి వెళ్లినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తున్నారని, ప్రస్తుతం ఆమె పరిస్ధితి బాగానే ఉందని వెల్లడించాయి.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్, సోనియా గాంధీలకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. జూన్ 8న సోనియాగాంధీని విచారణకు రావాలని ఈడీ కోరింది. ఇవాళ విచారణకు రావాలని రాహుల్ గాంధీనికోరింది. అయితే తాను విదేశాల్లో ఉన్నందున జూన్ 8నే వస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications