అసెంబ్లీకి చేరుకొన్న ఆ ఇద్దరు: 'కాంగ్రెస్ కే ఓటు', ఇంత కాలం ఎక్కడ?
బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకొన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ క్యాంప్ కు దూరంగా ఉన్నారు.కానీ, వీరిద్దరూ మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాంగ్రెస్ పార్టీ క్యాంప్ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ లు దూరంగా ఉన్నారు. బిజెపి నేతలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు వల వేశాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. వీరిని తమ క్యాంప్ లోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంత కాలంగా కాంగ్రెస్ క్యాంప్ కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఇవాళ మధ్యాహ్నం బెంగుళూరులోని ఓ హోటల్ లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారనే సమాచారంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులు వెళ్ళారు.
Bengaluru: Congress MLA Pratap Gowda Patil having lunch at Vidhana Soudha, Congress's DK Suresh and Dinesh Gundu Rao present with him. pic.twitter.com/dZwx9zFhKa
— ANI (@ANI) May 19, 2018
ఎట్టకేలకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విధాన సభకు వచ్చారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన తర్వాత విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతాప్ గౌడ పాటిల్ ను విధానసభ వద్ద కాంగ్రెస్ లీడర్ డికె శివకుమార్ అసెంబ్లీలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు చేస్తారని డికె శివకుమార్ అసెంబ్లీ వెలుపల మీడియాకు వివరించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎవరు బందీలుగా ఉంచారనే విషయమై వివరిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications