బీజేపీ 40 శాతం కమీషన్ పార్టీ, రేట్ కార్డు రిలీజ్, ఢిల్లీ జూట్ బెంగళూరు లూట్, కాంగ్రెస్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి పంపించాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీ అనే సింబల్ ఆ పార్టీ నాయకులు కర్ణాటకలో 40 శాతం కమీషన్ వసూలు చేసి ప్రజలను లూటీ చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ రేట్ కార్డును శుక్రవారం విడుదల చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
మే 10వ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2019 నుంచి 2023 వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో బీజేపీ నాయకులు వసూలు చేసిన కమీషన్ ను వివరిస్తూ బీజేపీ నాయకుల వసూల రేట్ కార్డు అంటూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓ పోస్టర్ విడుదల చెయ్యడం కలకలం రేపింది. ఇది బీజేపీ నాయకుల తీరు అని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.

గత కొన్ని నెలల నుంచి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూనే ఉంది. కర్ణాటకలో మంత్రిగా పని చేసిన బీజేపీ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప ఆయనకు సంబంధించిన శాఖలో పనులు చేసిన బెళగావికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ను తనకు 40 శాతం కమీషన్ ఇవ్వాలని వేధించాడని, అందుకే కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
కాంట్రాక్టర్ సంతోష్ ఆత్మహత్య చేసుకున్న తరువాత కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి 40 శాతం కమీషన్ ప్రభుత్వం అనే ట్యాగ్ తగిలించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ విపరీతంగా ప్రచారం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా తయారు చేసిన 40 శాతం కమీషన్ పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమ్ముడుపోయిందని ఈ పోస్టర్ కింద ఢిల్లీ జూట్ బెంగళూరు లూట్ అంటూ కామెంట్ చేశారు.

బీజేపీకి 40 శాతం కమీషన్ బాగా కలసి వచ్చిందని, అందుకే వాళ్లు 40 నెంబర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీతో 40 కిలోమీటర్ల రోడ్ షో ఏర్పాటు చేస్తున్నారని, 40 నెంబర్ తో బీజేపీ నాయకులు ఏమైనా చేస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నాయకుడు, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ రణదీప్ సూర్జేవాలా పోస్టు చేశారు.
మొత్తం మీద బీజేపీ నాయకులను 40 శాతం కమీషన్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రచారం చెయ్యడం బీజేపీ నాయకులకు ఇబ్బందిగా మారిందని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రేట్ కార్డ్ పోస్టర్ కు కౌంటర్ గా ఎదురుదాడి చెయ్యడానికి బీజేపీ సిద్దం అవుతోందని తెలిసింది. పదేపదే 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ 85 శాతం కమీషన్ పార్టీ అని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications