వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం -రెబల్ నేతలతో భేటీకి సోనియా ఓకే -ప్రక్షాళన దిశగా

|
Google Oneindia TeluguNews

అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ నుంచి గ్రామ స్థాయిదాకా కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ ఆగస్టులో అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి, ఆ తర్వాతి కాలంలో సొంత నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్న అసమ్మతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది రెబల్ నేతలతో అధినేత్రి సోనియాగాంధీ భేటీ కానున్నారు.

అసమ్మతి నేతలను కలిసేందుకు అధినేత సోనియా సమ్మతి తెలిపారని, శనివారమే(డిసెంబర్ 18న) భేటీ జరిగే అవకాశముందని, సమావేశానికి సంబంధించి పూర్తి బాధ్యతలను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ చూసుకోనున్నట్లు తెలిసింది. ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముందు పార్టీ అధ్యక్షుడు సహా అనేక మార్పులను కోరుతూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే వారంతా సదరు సమావేశానికి హాజరు కాలేదు. కేవలం ఐదు-ఆరుగురు నేతలు మాత్రమే హాజరయ్యారు.

కరోనా వ్యాక్సిన్‌ మంత్రదండం కాదు -ఇప్పుడే ఎక్కువ అప్రమత్తత అవసరం: WHOకరోనా వ్యాక్సిన్‌ మంత్రదండం కాదు -ఇప్పుడే ఎక్కువ అప్రమత్తత అవసరం: WHO

రెబల్స్ తో అధినేత్రి సోనియా జరపబోయే సమావేశంలో ప్రధానంగా పార్టీలో సయోధ్య దిశగా అడుగులు పడుతున్నాయని, దానికి ఈ సమావేశమే కీలకమని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ, ప్రియాంగ గాంధీ వాద్రా కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది రెబల్స్‌కు సోనియాగాంధీకి మధ్య జరిగే మీటింగ్ కాదని పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇందులో పాల్గొనన్నుట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

congress interim chief Sonia Gandhi to meet 23 rebels who asks for organisational change

గతంలో పార్టీకి క్షీణతపై ఆందోళన వ్యక్తం చేసిన కమల్‌నాథ్.. ''పార్టీకి తాత్కాలిక అధ్యక్షులు కాకుండా శాశ్వత, చురుకైన అధ్యక్షులు కావాలి'' అని అసమ్మతి నేతలు ఇచ్చిన పిలుపును ఆయన సమర్థించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలను కోల్పోయింది. రాజస్తాన్‌లో సచిన్ పైలట్ అసమ్మతికి కాంగ్రెస్ పార్టీ అల్లకల్లోలం అయింది. అనంతరం పరిస్థితులు చక్కదిద్దుకున్నప్పటికీ పార్టీ నేతల్లో ఆందోళన అలాగే ఉంది. తాజాగా..

జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనంజగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా -మా సీఎం కంటే ఎక్కువ -పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలనం

Recommended Video

Kerala Local Body Polls : NDA secures the Pandalam Municipality

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంపైనా ఉన్నత స్థాయి నేతలు అసమ్మతి ఎదుర్కోవాల్సి వచ్చింది. ''ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ముగిసింది'' అని సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇక మరో సీనియర్ నేత చిదంబరం సైతం ''సమగ్ర సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది'' అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఈ దశలో రెబల్స్ తో సోనియా జరుపుతోన్న సమావేశం పార్టీ ప్రక్షాళన దిశగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

English summary
A group of Congress "rebels" who wrote a letter flagging a leadership drift and calling for sweeping organizational changes, may finally get to meet with Sonia Gandhi. Former Madhya Pradesh Chief Minister Kamal Nath was key to setting up the meeting, sources say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X