వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంకకు పార్టీ పగ్గాలు - రాజ్యసభకు ఎంపిక : ప్రాంతీయ పార్టీలతో పొత్తులు - నిర్ణయం దిశగా కాంగ్రెస్..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ మేధో మధన సదస్సులో పార్టీ బలోపేతం పైన పలు ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. రానున్న రెండేళ్లకాలంలో పార్టీ శ్రేణులను ఉద్యమాల్లోకి నడిపించే దిశగానూ అడుగులు వేస్తోంది. మరోవైపు మరింత మందికి చేరువ అయ్యేందుకు పార్టీ నిర్మాణాలను ఎంతలా సరళతరం చేసినా.. క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదనే సంకేతాలనూ అధిష్ఠానం పంపించింది.

ఇక, ఇదే సమయంలో తదుపరి సారథి వైపూ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ పార్టీని ఇకనుంచి ముందుండి నడిపించాలని, ఆయన తెర వెనుక నాయకత్వం నిర్వహించకూడదని ఈ సమావేశంలో పలువురు సూచనలు చే శారు. రాహుల్‌ గాంధీ ముందుకు రాకపోతే ప్రియాంకాగాంధీకి పట్టం కట్టాలని, పార్టీకి ఒక బలమైన నాయకత్వం ఉండాలని కీలక నేతలు ప్రతిపాదించారు.

ప్రియాంకకు కీలక బాధ్యతలు ఇవ్వాలి

ప్రియాంకకు కీలక బాధ్యతలు ఇవ్వాలి

ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబిర్‌లో ప్రియాంక పాత్ర పైన చర్చ సాగింది. అందులో భాగంగా.. ప్రియాంక గాంధీని రాజ్యసభ సభ్యురాలిని చేసే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న బీజేపీకి చెందిన కేసీ రామమూర్తి, నిర్మలాసీతారామన్‌, కాంగ్రె్‌సకు చెందిన జైరాంరమేశ్‌ పదవీ కాలం ముగుస్తోంది.

వీరితో పాటు కేంద్రమాజీ మంత్రి అస్కర్‌ఫెర్నాండెజ్‌ మృతితో ఖాళీ అయిన స్థానంతో కలిపి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దిరాగాంధీకి రాజకీయంగా ఇబ్బందులు కలిగినప్పుడు రాష్ట్ర నేతల సూచన మేరకు చిక్కమగళూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించి విజయం సాధించారు.

కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక

కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక

ప్రస్తుతం అదే కుటుంబానికి చెందిన ప్రియాంకను రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు యాభై శాతం ప్రాతినిథ్యం కల్పించాలనేది ఈ సదస్సులో కొత్తగా ముందుకొచ్చిన ప్రతిపాదన. ఒక నేతకు రెండుసార్లు మాత్రమే రాజ్యసభ స భ్యులుగా అవకాశం ఉండాలనేది మరో యోచన.

రాబోయే కా లంలో యువ నాయకత్వాన్ని ముందుపెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం దాదాపుగా నిర్ణయించింది. ఆదివారం శిబిరం ముగింపు వేదికపై దీనిపై ప్రకటన ఉంటుందని రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి, యువ నేత సచిన్‌ పైలట్‌ తెలిపారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దీటైన రాజకీయ ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఎదగాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది.

ముగింపు సమయంలో కీలక నిర్ణయాల ప్రకటన

ముగింపు సమయంలో కీలక నిర్ణయాల ప్రకటన


ప్రాంతీయపార్టీలతో సంబంధాలను మెరుగుపరచుకోవడం, రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సమీకరణాలకు సిద్ధపడటం.. అనే రెండు కోణాలనుంచి ఈ వ్యూహానికి తుది రూపు ఇచ్చేపనిలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. ఇంకా ఎన్నికలు రెండేళ్లే ఉండటం వల్ల ఒంటరి పోటీ ఆలోచనను విరమించుకోవాలని ఆ పార్టీలోని 'తిరుగుబాటు' నేతలు..అధిష్ఠానంపై ఒత్తిడితెచ్చి ఒప్పించినట్టు సమాచారం. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన, ప్రతిపాదిత 33 శాతం మహిళా రిజర్వేషన్లలో దళితులు, బీసీలకు సబ్‌కోటాల అమలు తదితర అంశాలపైనా సోనియా కమిటీ సుముఖత చూపినట్టు తెలుస్తోంది.

English summary
Congress’ three-day Chintan Shivir in Rajasthan’s Udaipur, party leaders said that Priyanka Gandhi Vadra should be made the president of the party as she is the most popular face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X