అవే దేశానికి పట్టిన చీడపరుగులు: కాంగ్రెస్‌పై నరేంద్ర మోడీ నిప్పులు
భోపాల్: దేశంలో అభివృద్ధిలో వెనుకబడడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్‌లో ఓటు బ్యాంకు రాజకీయాలు సమాజాన్ని చీడపురుగుల్లా నాశనం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మనదేశం కంటే ఇతర దేశాలపై ప్రేమ ఎక్కువని మండిపడ్డారు.
Recommended Video

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ భోపాల్‌లో 'కార్యకర్తల మహాకుటుంబ ర్యాలీ' నిర్వహించింది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు.

చీడపురుల్లా నాశనం చేస్తున్నాయి..
‘దేశంలోని అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందడానికి కొన్ని విధానాలు తీసుకురావడం మన బాధ్యత. మన దేశంలో ఓటు బ్యాంకు రాజకీయా లు మనదేశాన్ని చీడపురుగుల్లా నాశనం చేస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడడం, దాని ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చడమే బీజేపీ విధానం' అని మోడీ స్పష్టం చేశారు.

అభివృద్ధి నెమ్మదికి అదే కారణం
‘ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారు అభివృద్ధి గురించి పట్టించుకోరు. అధికారంలో కొనసాగడంపైనే ఆసక్తి చూపుతారు. మన దేశం నెమ్మదిగా అభివృద్ధి చెందడానికి ఇది ఒక కారణం' అని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

ఇస్లామిక్ దేశాల్లో కూడా లేదు..
‘ప్రస్తుతం ఇస్లామిక్ దేశాలు కూడా ముమ్మారు తలాక్‌ను అంగీకరించట్లేదు. కానీ, మన దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దాన్ని రద్దు చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీని ఓ మహిళ నడిపిస్తున్నప్పటికీ తలాక్ బాధిత మహిళల గురించి పట్టించుకోలేదు' అని మోడీ కాంగ్రెస పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
భయపడిపోయేవారు..
‘యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలను శత్రువులుగా చూస్తూ కుట్రపూరితంగా వ్యవహరించింది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా కేంద్ర మంత్రి నాకు నమస్తే పెడితే, ఆ ఫొటో పేపర్‌లో వస్తే.. ఇక ఆ మంత్రి తన రాజకీయ జీవితం ముగిసిపోతుందని చాలా భయపడిపోయేవారు. కాంగ్రెస్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉందో ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అగ్ర, కింది వర్గాల కులాలు అనే భేదాలు లేకుండా అందరితో అందరి వికాసం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించి చెప్పాలని కోరారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications