దిగ్విజయ్ సింగ్ చిన్న కూతురు కర్ణిక మృతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె కర్ణిక కుమారి అనారోగ్యం కారణంగా మృతి చెందింది. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆమె ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక విమానంలో ఆమె అత్తింటిగారి నివాసమైన అహ్మదాబాద్‌కు తరలించారు. కాగా, నిరుడు యూఎస్‌లో కర్ణిక కుమారి సింగ్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు.

దిగ్విజయ్ సింగ్, ఆశా దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. దిగ్విజయ్ భార్య ఆశా కూడా ఫిబ్రవరి 27, 2013లో క్యాన్సర్ వ్యాధితోనే మృతి చెందారు.
దిగ్విజయ్ సింగ్ కుమార్తె మృతికి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications