కృష్ణానదిలో మృతదేహమై కనిపించిన కాంగ్రెస్ నాయకురాలు: మజ్లిస్ నేతపై అనుమానాలు
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు ఒకరు దారుణహత్యకు గురయ్యారు. అదృశ్యమైన కొన్ని గంటల వ్యవధిలో ఆమె మృతదేహమై కనిపించారు. ఈ హత్యోదంతంలో మజ్లిస్ పార్టీ నాయకుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గురువారం రాత్రి కనిపించకుండా పోయిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం మృతదేహమై కనిపించారు. కృష్ణానదిలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. హతురాలి పేరు రేష్మా పడెకనూర్. కర్ణాటకలో అధికారంలో ఉన్న జనతాదళ్ (సెక్యులర్) విజయపుర జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జిల్లాలోని దేవరహిప్ప నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. టికెట్ ఇవ్వడానికి జేడీఎస్ నిరాకరించింది. దీనితో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

గురువారం రాత్రి ఆమె అదృశ్యం అయ్యారు. ఎంత రాత్రయినప్పటికీ రేష్మా ఇంటికి రాకపోవడం, ఆమె సెల్ ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కొల్హారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులతో పాటు కుటుంబీకులు ఆమె కోసం రాత్రంతా గాలించినప్పటికీ ఫలితం రాలేదు. మధ్యాహ్నానికి మృతదేహమై కనిపించారు. విజయపుర జిల్లాలోని బసవన బాగేవాడి తాలూకా కొల్హార గ్రామ సమీపంలో కృష్ణానదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడికి చెందిన కారులో వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఇష్టపూరకంగా కారులో వెళ్లారా? లేక అపహరించారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. కొల్హార పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను కోరారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications