దీక్షా శిబిరంలో ప్రియాంక గాంధీ..!!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా లేనప్పటికీ- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు అంగీకారం తెలిపారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు.

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న బ్రిజ్ భూషణ్‌పై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ముందుకు రావట్లేదు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

Priyanka Gandhi Vadra meets the wrestlers protesting

ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి. ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకుంటామంటూ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి జనవరిలో మేరీకోమ్ సారథ్యంలో అయిదుమంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. నాలుగు వారాల్లోగా నివేదికను అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాలేదు. రోజులు గడుస్తున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చకపోవడంతో మరోసారి నిరసన దీక్షలకు దిగారు.

దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగిస్తోన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను సైతం జారీ చేసింది. దీనితో బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వారి నిరసన దీక్షలకు క్రమంగా మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా రెజ్లర్లు మద్దతు పలికారు. వారితో కలిసి జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలుస్తోన్నారు. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సైతం వారికి తన మద్దతు ప్రకటించారు.

Priyanka Gandhi Vadra meets the wrestlers protesting

తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా- మహిళా రెజ్లర్లను కలిశారు. ఈ తెల్లవారు జామున తన నివాసం నుంచి కారులో బయలుదేరిన ఆమె నేరుగా జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. రెజ్లర్లను పలకరించారు. వారితో కలిసి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఆ సమయంలో ఆమె వెంట ఢిల్లీ కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+