పని లేదుగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని..: కాంగ్రెస్‌పై మోడీ

హర్యానా: ప్రధాని నరేంద్ర మోడీ హర్యానా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులపై తనదైన శైలిలో పలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘మీకు పనేం లేదుగా. మీలో కొందరికి ఇప్పుడు పని ఉన్నా.. త్వరలో ఆ పనీ ఉండదు. అంతా కలిసి స్వచ్ఛ భారత్‌లో భాగస్వాములు కండి' అని మోడీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా నేత అధీనంలోని పార్టీ పాలనలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి, ఆయన కుటుంబానికి సేవ చేసేందుకే హర్యానా ప్రభుత్వం పరిమితమైందని మోడీ ఆరోపించారు.

'Congress Leaders Have Nothing to Do. Join the Cleanliness Drive': PM Narendra Modi

హర్యానా ప్రభుత్వంపై ఈసికి మోడీ సూచన

భూబకాసురుల ముందు మోకరిల్లిన భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించారు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన డిఎల్ఎఫ్ భూములను క్రమబద్ధీకరించే విషయంలో హుడా ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి అనుమతిచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో సహకరించని అధికారులను హుడా ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+