గోవా కాంగ్రెస్‌లో అప్పుడే సంక్షోభం: పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే రాజీనామా

Subscribe to Oneindia Telugu

పనాజీ: తాజా గోవా ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా.. అధికారాన్ని దక్కించుకోవడంలో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. అదే సమయంలో చాకచక్యంగా వ్యవహరించి మిత్రపక్షాల మద్దతుతో మనోహర్ పారికర్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగానే కాంగ్రెస్ కు మరో ఊహించని షాక్ తగిలింది. అధిష్టానం వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వజిత్‌ రాణే, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ గోవా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ఈ సందర్బంగా ఆయన ఆరోపించడం గమనార్హం.

 CONGRESS LOSES MLA VISHWAJIT RANE AS BJP SAILS THROUGH

కాగా, గురువారం నాడు గోవా అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో సీఎం మనోహర్ పారికర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు 10స్థానాలు గెలుచుకున్నారు. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ సమయస్పూర్తిగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమై అధికారానికి దూరమైంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే కూడా ఇదే స్పష్టం చేశారు. అత్యధిక స్థానాలు పార్టీ ఖాతాలో చేరినప్పటికీ అధికారంలోకి రాకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Not only did the Congress squander its chance to form the govt in Goa after winning 17 seats, it has now lost an MLA as the Manohar Parrikar govt easily sailed through.
Please Wait while comments are loading...