Congress manifesto: బజరంగ్ దళ్‌పై నిషేధం: పీఎఫ్ఐపైనా: తొలి కేబినెట్‌లోనే సంతకం
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో పోలింగ్‌ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. 13వ తేదీన ఓట్ల లెక్కింపును షెడ్యూల్ చేసింది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేలిపోయేది ఆ రోజే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార తీవ్రతను పెంచాయి..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కీలక హామీలను ఇందులో పొందుపరిచారు. తాము అధికారంలోకి వస్తే- అమలు చేయాల్సిన పథకాలు, కార్యక్రమాలన్నింటినీ ఇందులో వివరించారు.

తాము అధికారంలోకి వస్తే- విధ్వేషాలను రెచ్చగొట్టే మత సంస్థలపై కఠిన చర్యలను తీసుకుంటామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పేర్లను ఇందులో చేర్చింది. బజరంగ్ దళ్.. విశ్వహిందూ పరిషత్‌కు అనుబంధంగా పని చేసే సంస్థ. ముస్లిం యువత నిర్వహిస్తోన్న సంస్థ పీఎఫ్ఐ. ఈ రెండింటి కార్యకలాపాలను నిషేధిస్తామని తెలిపింది.
వీటితో పాటు రాష్ట్రంలో విధ్వేషాలను రెచ్చగొట్టే ఎలాంటి మత సంస్థలనూ ఉపేక్షించబోమని, మతాలకు అతీతంగా వాటిపై కఠిన చర్యలను తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రాన్ని శాంతి తోటగా మార్చాలనేదే తన అభిమతమని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నో వనరులు ఉన్నాయని, మత విధ్వేషాలను తొలగించుకోగలిగితే- వాటన్నింటినీ వినియోగించుకుంటూ సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తామని తెలిపింది.
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మెజారిటీ హామీలన్నింటినీ- అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలపింది. అత్యధిక సంఖ్యలో ప్రజలకు మేలు కలిగించే హామీలన్నీ సత్వరమే అమలులోకి వచ్చేలా రూపొందించే ప్రతిపాదనలపై తొలి మంత్రివర్గ సమావేశంలోనే సంతకాలు చేస్తామని కాంగ్రెస్- ఈ మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను పెంచుతామని, తొలి కేబినెట్‌లోనే దీనిపై సంతకం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందిన షెడ్యూల్డ్ కులాలు- 15 నుంచి 17 శాతం, షెడ్యూల్డ్ తెగలు- 3 నుంచి 7 శాతం, మైనారిటీ- 4 శాతం, లింగాయత్, వక్కలిగ, ఇతర వర్గాల రిజర్వేషన్లను పెంచడంతో పాటు వాటిని 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చింది కాంగ్రెస్.
యువ నిధి, గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, మహిళా శక్తి పేర్లతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని తెలిపింది కాంగ్రెస్. ఈ పథకం కింద నిరుద్యోగ యువకులకు ప్రతినెలా 3,000 రూపాయలు, డిప్లొమా గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. గృహజ్యోతి కింద గృహావసర విద్యుత్ వినియోగంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications