మా పార్టీ ఎమ్మెల్యేల కోసం ఎన్ని రూ కోట్లు గాలం వేశారంటే ?, సాంబ రాసుకో ఇది గ్యారెంటి !
బెంగళూరు: కర్ణాటక డీసీఎం డీకే రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అందులో ఎలాంటి గందరగోళం లేదని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ బాంబు పేల్చారు. మండ్యలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే రవికుమార్ కాంగ్రెస్ పార్టీ కోసం డీకే శివకుమార్ శక్తి వంచనల లేకుండా పనిచేశాని అన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నిర్వహించి అధికారంలోకి తీసుకురావడంలో డీకే శివకుమార్ విజయం సాధించారని, అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలియదని అన్నారు. సీఎం సిద్ధరామయ్య మంచి పని చేస్తున్నారు. బీజేపీ తప్పుడు ప్రకటనలు ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు అందజేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవివకుమార్ చెప్పారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, మండ్య ప్రస్తుత ఎంపీ సుమలత కాంగ్రెస్‌లో లేరని, ఆమె బీజేపీలో చేరారని రవికుమార్ అన్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తామని మండ్య ఎమ్మెల్యే రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.
ఆపరేషన్ కమల నాలుగు దిక్కులా సాగుతోంది. ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని రవికుమార్ మరో బాంబు పేల్చారు. మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సన్నిహితుడు సంతోష్ ఆపరేషన్ కమల పనిని సీక్రేట్ గా చేస్తున్నాడని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడానికి రూ 50 కోట్లు ఎర చూపుతోందని మండ్య ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు.

మైసూర్, బెళగావిలోని గోల్డ్ ఫించ్ హోటల్‌లో సంతోష్ మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్నేహితులలో ఒకరిని కలిశారని రవికుమార్ ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ లోని ఎమ్మెల్యేలకు గతంలో గాలం వేసిన వ్యక్తి పేరు, ఆ టీమ్ పేరు ప్రస్తావించకుండా మళ్లీ యాక్టివ్‌గా ఉందని ఎమ్మెల్యే రవికుమార్ ఆరోపించారు.
బీజేపీ వాళ్లకు వేరే పని లేదు, ఉదయం లేవగానే ఆపరేషన్ కమల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వెతుక్కోవడం మొదలుపెట్టారని, మా ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఆడియో, వీడియో మా దగ్గర ఉందని, సమయం వచ్చినప్పుడు దానిని ప్రజల ముందు విడుదల చేస్తామని రవికుమార్ బాంబు పేల్చారు. అయితే బీజేపీ నాయకులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అంటున్నారు బీజేపీ కార్యకర్తలు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications