అసెంబ్లీహాలులోకి గ్రెనేడ్‌తో వచ్చిన ఎమ్మెల్యే.. బిత్తరపోయిన సభ్యులు
కొచ్చి: కేరళ అసెంబ్లీ హాలులోకి ఓ ఎమ్మెల్యే గ్రెనేడ్ తీసుకురావడం బుధవారం కలకలం సృష్టించింది. కాంగ్రెస్‌కు చెందిన తిరువంచూర్ రాధాకృష్ణన్(68) కొట్టాయం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో హోంమంత్రిగా కూడా ఈయన పనిచేశారు.
బుధవారం అసెంబ్లీ హాలులోకి ఎమ్మెల్యే రాధాకృష్ణన్ గ్రెనేడ్‌ను తీసుకురావడమేకాక, దాన్ని స్పీకర్ శ్రీరామకృష్ణన్‌కు చూపించారు. ఎమ్మెల్యే గ్రెనేడ్‌ను బయటికి తీయగానే సభలోని వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

అయితే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. గత వారం ఆందోళన చేపట్టిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయోగించిన భాష్పవాయు గోళాలు కాలం చెల్లినవంటూ మండిపడ్డారు.
ఇదిగో.. ఇలాంటివే అంటూ తన చేతిలోని గ్రెనేడ్‌ను చూపెట్టారు. ఆ తరువాత ఎమ్మెల్యే రాధాకృష్ణన్ ఆ షెల్‌ను స్పీకర్‌కు సమర్పించడంతో సభలోని అందరూ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications