వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్... మారని ఎమ్మెల్యేల తీరు... అధికారిపై బురద దాడి...!! వీడీయో

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ వర్గీయ సంఘటన మరవక ముందే మరో సంఘటన మహారాష్ట్రలో జరిగింది..మధ్యప్రదేశ్‌లో మున్సిపల్ అధికారిని బీజేపీ ఎమ్మెల్యే బ్యాట్‌తో కొట్టగా...తాజగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంతయింది.హై వే రోడ్డు పరీశీలనకు వచ్చిన ఇంజనీర్ పై ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులు బురద నీటీని మీద పోశారు. అనంతరం ఇంజనీర్‌ను తాళ్లతో కట్టివేశారు.

రాజకీయ నాయకుల అధికార పైశాచికత్వం

రాజకీయ నాయకుల అధికార పైశాచికత్వం

రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం రోజురోజుకు ఎక్కువవుతుంది. ప్రజల తరుఫున ప్రతినిధులుగా ఉన్నమనే కనీస ఆలోచన లేకుండా వ్యక్తగత కక్షలతో ప్రభుత్వ అధికారులపై జులుం చూపిస్తున్నారు..దీంతో అధికారులపై ఇష్టారాజ్యంగా వ్వవహరిస్తున్నారు...ఈ నేపథ్యంలోనే ఇండోర్ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ వర్గీయ చేసిన సంఘటనపై ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడ సీరియస్ స్పందించారు...ఇలాంటీ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు...అయినా కూడ... బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ ఇంజనీర్ పై బురద నీళ్లు పోసి తమ పై శాచికత్వాన్నిచాటుకున్నారు.

ఇంజనీర్ పై బురద నీరు...


మహారాష్ట్రలోని కంకావళి అనే ప్రాంతంలో నిర్మితమవుతున్న ముంబై గోవా హైవే పై గుంతలు పడి, రోడ్డంతా బురదమయంగా మారింది..దీంతో ఆ రోడ్డును పరీశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే వెళ్లాడు..ఇక ఎమ్మెల్యేతోపాటు హైవే పర్యవేక్షక ఇంజనీర్ అయిన ప్రకాశ్ షెడ్కర్ కూడ ఉన్నాడు..ఇక పర్యవేక్షణలో భాగంగా ఎమ్మెల్యే నితేష్ సదరు ఇంజనీర్ పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలోనే ఆయనను నెట్టివేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది..ఇక ఓ వైపు ఎమ్మెల్యే ఇంజనీరుతో మాట్లాడుతుండగానే మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ఇంజనీరుపై బకెట్లలో నింపిన బురద నీటిని ఆయన పై గుమ్మరించారు..ఇలా రెండు బకెట్లతో ఇంజనీరుపై ప్లాన్ ప్రకారమే పోసినట్టు తెలుస్తోంది..ఇక బురద నీరు పోయడమే కాకుండా ఇంజనీర్‌ను తాళ్లతో కట్టివేశారు.

ఎమ్మెల్యే తీరుపై విమర్శలు

ఎమ్మెల్యే తీరుపై విమర్శలు

కాగా ఎమ్మెల్యే నితేశ్ మహారాష్ట్ర మాజీ సీఎం నారయణ కుమారుడు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ముందే అయన అనుచరులు ఓ అధికారిపై బురద పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో సైతం హల్‌చల్ సృష్టిస్తుంది..దీంతో ఎమ్మెల్యే తీరుపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇంజనీరుపై బురద ఎందుకు పోశారు..దానికి ఇంజనీరు ఎలాంటీ సంబంధం ఉందనే వివారాలు తెలియాల్సి ఉంది.

English summary
In yet another case of assault on a government official, Maharashtra Congress MLA Nitesh Rane and his supporters poured mud on a highway engineer.Maharashtra Congress MLA Nitesh Rane is the son of former Maharastra Chief Minister leader Narayan Rane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X