రే*ప్ చేస్తే తీర్థ యాత్ర చేసినంత పుణ్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో ఈ వ్యవహారం ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్యా… అత్యాచార ఘటనలను కులాలు, మతాలతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. కొన్ని మత గ్రంథాలు, సామాజిక వర్గాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా అత్యాచారాల బాధ్యతను నిందితులపై కాకుండా, సమాజంలోని వర్గాలపై మోపేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

Congress MLA Phool Singh Baraiya

బరయ్యా వాదన ప్రకారం.. ఆయన కొన్ని మత గ్రంథాలు షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు షెడ్యూల్డ్ తెగలు (ST) మహిళలపై దాడి చేస్తే యాత్ర చేసినంత పుణ్యం వస్తుందన్నారు. భారతదేశంలో అధిక అత్యాచారాలు SC, ST, BC వర్గాల్లో జరుగుతాయి. మత బోధనలను వక్రీకరించడం వల్లే లైంగిక హింస పుడుతుందని ఆయన సిద్ధాంతీకరించారు. తీర్థ యాత్ర చేయలేని వారికి నిర్దిష్ట కుల మహిళలతో సంబంధాల ద్వారా ఆధ్యాత్మిక పుణ్యం పొందడానికి గ్రంథాలు 'ప్రత్యామ్నాయ మార్గాలని' సూచించాయని ఆరోపించారు. ఇతర వర్గాల శారీరక రూపంపై బరైయా ప్రశ్నలు లేవనెత్తారు. నేరాలు మతపరమైన పుణ్యం వస్తుందనే అపోహతో జరుగుతున్నాయన్నారు. శిశువులు, చిన్నపిల్లలపై దాడులు సమ్మతి, శారీరక కారణాల వల్ల కాకుండా, తప్పుడు విశ్వాసాల వల్లే అని ఉటంకించారు.

ఇదే మీ మహిళా సాధికారతా?

ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రాగానే రాజకీయ వర్గాల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. అధికార బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ… “ఇలాంటి మాటలు మహిళలపై జరిగే నేరాలను తేలికగా చూడడమే కాకుండా, బాధితులపై నింద మోపడమే” అంటూ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుని, “ఇదే మీ మహిళా సాధికారతా?” అంటూ ప్రశ్నలు సంధించింది.

చట్టపరమైన చర్యలు?

వివాదం ముదిరడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ అధికారికంగా స్పందించకపోయినా, అంతర్గతంగా మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. మహిళా హక్కుల కోసం పోరాడుతున్నామంటూ చెప్పే పార్టీ నేతలే ఇలా మాట్లాడితే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందన్న చర్చ మొదలైంది.ఇదే సమయంలో మహిళా సంఘాలు, దళిత సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఫూల్ సింగ్ బరయ్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై నేరాలను సమర్థించేలా మాట్లాడటం నేరమని, ఇటువంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు న్యాయ నిపుణులు కూడా ఈ వ్యాఖ్యలు ద్వేష ప్రసంగం కింద పరిగణనలోకి రావచ్చని అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు

వైరల్ వీడియోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన వ్యాఖ్యలు కావడంతో… కాంగ్రెస్ పార్టీపై, మొత్తం రాజకీయ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళా భద్రతపై రాజకీయ నేతలు ఎంత సున్నితంగా వ్యవహరించాలి అన్న అంశాన్ని మరోసారి ఈ ఘటన చర్చకు తెచ్చింది. మొత్తానికి… ఫూల్ సింగ్ బరయ్యా వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయాలను మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మహిళల భద్రత, బాధ్యతాయుత రాజకీయాలు అనే అంశాలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది? చట్టపరమైన చర్యలు ఉంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+