మహిళా ఎమ్మెల్యేకు బూతు మేసేజ్ లు, అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ప్రకటన

మహిళ ఎమ్మెల్యేకు బూతు మేసేజ్ లు వచ్చాయి. ఈ మేసేజ్ లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయాన్ని తాను అసెంబ్లీ ప్రస్తావించనున్నట్టు వర్ష గైక్వాడ్ ప్రకటించారు.

ముంబై:మహిళలకు వేధింపులు తప్పడం లేదు. వారు ఏ స్థాయిలో ఉన్నా కాని, వారిని వేధింపులకు గురౌతున్నారు. మహరాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళ ఎంఏల్ఏకు బూతు మేసేజ్ లు వస్తున్నాయి. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

మహరాష్ట్రలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఏల్ఏ వర్ష గైక్వాడ్ కు తరచూ అసభ్య మేసేజ్ లు వస్తున్నాయి. పురుషాధిక్యం గల రాజకీయాల్లో వస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ట్రెండ్ గా మారిందని ఆమె ఆరోపించారు.

ఎంఏల్ఏలుగా ఉన్న తమ లాంటి వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాను ప్రస్తావిస్తానని ఆమె చెప్పారు.

Congress MLA Varsha Gaikwad gets lewd messages

ధరవి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆమె ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.తనతో పాటు తన మాదిరిగానే మరో ఇద్దరు మహిళ నేతలు కూడ ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించారు.

శివసేన నాయకురాలు నీలమ్ గోర్ఖెను అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. బిజెపి నాయకురాలు షైనా కు కూడ బూతు మేసేజ్ లు కూడ వచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+