మోడీ సీరియళ్లను కూడా వదలడం లేదు !? ఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్

ముంబై : ఎన్నికల వేళ క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్న పార్టీలు .. తాము చేసిన, చేస్తోన్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు టీవీ, పేపర్లలో యాడ్లు ఇస్తుంటారు. కానీ ఇటీవల బయోపిక్‌ల పరంపర మొదలైంది. ప్రధాని మోదీ బయోపిక్ నిర్మాణ కార్యక్రమం పూర్తైంది. రిలీజ్ చేయొద్దని ఈసీని కాంగ్రెస్ కోరింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో 3 టీవీ సీరియల్స్ బీజేపీ, మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని నిషేధించాలని ఈసీకి విజప్తి చేశాయి.

సీరియళ్లలో ప్రచారం

సీరియళ్లలో ప్రచారం

మహారాష్ట్రలో మూడు సీరియళ్లు బీజేపీ ప్రభుత్వం, మోదీకి అనుకూలంగా ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆయా సీరియళ్లలో మోదీ, బీజేపీ ప్రభుత్వం, పథకాల గురించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందున తక్షణమే సీరియల్స్ నిలిపివేసీ, బీజేపీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 మోదీ ఫోటో కూడా వాడారు ..?

మోదీ ఫోటో కూడా వాడారు ..?

ఆయా సీరియళ్లలో మోదీ, బీజేపీ గురించి ప్రచారం చేయడమే గాక .. మోదీ ఫోటోను కూడా ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని వారు తెలిపారు. అంతేకాదు మోదీ ప్రభుత్వ రెండు పథకాల గురించి సీరియల్‌లో మాట్లాడుకుంటున్న దృశ్యాలను మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇక చర్యలే ..?

ఇక చర్యలే ..?

సార్వత్రిక ఎన్నికల కోసం మార్చి 10న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 7 విడుతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగి .. మే 23న ఫలితాలను ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. అప్పటినుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో టీవీ సీరియళ్లలో బీజేపీ ప్రచారంపై కాంగ్రెస్ నేతలు చేసినా ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+