ప్రధాని కార్యాలయంతో ఈసీ భేటీ వివాదం-లోక్ సభలో చర్చకు కాంగ్రెస్ వాయిదా తీర్మానం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఇవాళ కూడా నిరసనల మధ్యే ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్ సభలో ఓ కీలకమైన అంశంపై చర్చ కోరుతూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే దీనిపై సభ నిర్ణయం తీసుకునేలోపే విపక్షాలు లఖీంఫూర్ ఖేరీ ఘటనపై చర్చ కోరుతూ సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే తాజాగా ప్రధాని కార్యాలయంతో చర్చలు జరిపారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇవాళ ఓ కథనం ప్రచురించింది. దీంతో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో "సంస్థల స్వయంప్రతిపత్తి దెబ్బదింటోందని, దానిపై లోక్‌సభ చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నవంబర్ 16న ప్రధానమంత్రి కార్యాలయం కోరిన మీదట ఎన్నికల కమిషనర్లు ఆన్‌లైన్ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. దీనిపై దుమారం రేగింది.
దీనిపై లోక్ సభలో చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ... "సంస్థల స్వయంప్రతిపత్తి రాజీపడిందనే వాస్తవాన్ని ప్రస్తావించారు. ఈరోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనానికి సంబంధించి వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో సభ ఈ అంశంపై చర్చించడం చాలా ముఖ్యమని తెలిపారు.

అయితే, లఖింపూర్ ఖేరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేనీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేతో సహా విపక్ష ఎంపీలు సభా వెల్‌కి దూసుకెళ్లడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అయితే స్పీకర్ పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఎంపీలు తమ స్థానాల్లోకి వెళ్లేందుకు నిరాకరించడంతో సభ కొనసాగలేదు.
నిన్న కూడా లఖీంపూర్ ఖేరీ ఘటనపై విపక్షాలు సభా కార్యకలాపాల్ని పదే పదే అడ్డుకోవడంతో ఇరుసభలూ ఇవాళ్టికి వాయిదా వేశారు.. ఇవాళ కూడా ఇదే అంశంపై ఇరుసభల్లోనూ రచ్చ కొనసాగుతోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ తో విపక్షాలు రచ్చ చేస్తున్నా.. కేంద్రం మాత్రం దీనికి నిరాకరిస్తోంది. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేస్తోంది.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications