దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఇచ్చేయండి, మోదీది ఘరానామోసం, విభజించు పాలించు అంటే !
విభజించు, పాలించు అనే నినాదం కాంగ్రెస్ కు కచ్చితంగా సరిపోతుందని మరోసారి రుజువు అయ్యింది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని, నేటి బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ లేదని బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ డీకే సురేష్ ఆరోపించారు. ఇలాగే చేస్తే దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామని డీకే సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తోందని బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ, కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. అన్యాయం కాకుండా ఉండాలంటే మాకు ప్రత్యేక దేశం ఇవ్వాలని అడగాల్సి వస్తోందని బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్ డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న జీఎస్టీ డబ్బును ఉత్తర భారతదేశం కోసం మోదీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, దీంతో మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురౌతున్నాయని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆరోపించారు. ఇది ఇలాగే కొనసాగితే దక్షిణ భారత దేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని తాము పోరాటం చెయ్యాల్సి ఉస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ అన్నారు. మాకు రావాల్సిన డబ్బు మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ డీకే శివకుమార్ బీజేపీ నాయకులకు స్పష్టం చేశారు.

దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న జీఎస్టీలో ప్రత్యక్ష పన్నుల్లో కేంద్రం మాకు సరైన వాటా ఇవ్వడం లేదని, దక్షిణ భారత రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తున్నామని. దక్షిణాది రాష్ట్రాల నుంచి సేకరించిన నిధులను ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు ఇస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే దక్షిణాధి రాష్ట్రాలు మాకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎంపీ సురేష్ కేంద్రంలోని ఎన్ డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దక్షిణ భారతదేశంలో వసూలు చేస్తున్న జీఎస్టీ పన్నులు ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేయడం సరికాదని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు డబ్బులు ఎలా పంచుతున్నారో చూస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలకు ఆ సొమ్ము మళ్లుతున్నట్లు స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం మా కర్ణాటక రాఫ్ట్రం నుంచి రూ 4 లక్షల కోట్లకు పైగా పన్ను రాబడుతోందని, దానికి ప్రతిఫలంగా మాకు వచ్చేది చాలా తక్కువ వాటా అని, దీనిని మనం ప్రశ్నించుకోవాలని, దీన్ని సరిదిద్దుకోకుంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ గళం విప్పాల్సి వస్తుందని డీకే సురేష్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications