Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరోజు ఐరన్ లెగ్ హీరో, నేడు స్టార్ హీరో, 28 ఏళ్లలో ఏం సాధించాడంటే?, రాజమౌలి కూడా వదల్లేదు!

అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి 28 ఏళ్లు. కిచ్చ సుదీప్ 40కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కన్నడలోనే కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో కూడా సక్సెస్‌లు చవిచూసిన కిచ్చ సుదీప్ ఒకప్పుడు ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్నాడని ఎంత మందికి తెలుసు?

ఇప్పుడు కూడా కొత్త నటీనటులు, నటీమణులకు పోటీ ఇస్తూ ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటున్నాడు ఎస్ఎస్ రాజమౌలి ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్. ఈ అద్భుతమైన వినోద రంగంలో 28 సంవత్సరాలు నా జీవితంలో అత్యంత అందమైన భాగం అని, తనకు ఈసాటిలేని బహుమతి ఇచ్చిన ఆ దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కిచ్చ సుదీప్ ట్వీట్ చేశారు.

Sandalwood hero Kichcha Sudeep has completed 28 years as an actor

నా తల్లిదండ్రులు, కుటుంబం, విలువైన సాంకేతిక నిపుణులు, రచయితలు, నిర్మాతలు, నా సహనటులు, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రదర్శకులు, మొత్తం సినిమా యూనిట్ కుటుంబ సభ్యులు ఈ నాప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, నన్ను ఎప్పుడూ ఎంతగానే ప్రేమిస్తున్నందుకు, జీవితంలో నాకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించి తాను ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం అయిన నా అభిమానులకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని కిచ్చ సుదీప్ ట్వీట్ చేశారు.

నిజని నా వెంట ఉన్నది నా అభిమానులే అయినా వాళ్లు నాకు దేవుడు ఇచ్చిన స్నేహితులు అని కిచ్చ సుదీప్ అన్నారు. దేవుడు ఇచ్చిన ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆనందించానని, అవకాశాలు వచ్చినప్పుడు నా వంతు ప్రయత్నం నేను చేశానని, నన్ను నాలాగే అంగీకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు అని సుదీప్ ఎక్స్ లో (ట్విట్టర్) రాశారు. మొదటి సారి బ్రహ్మ సినిమా షూటింగ్ కోసం కెమెరా ముందు కంఠీరవ స్టూడియోలోకి వెళ్లానని, ఇక్కడికి నేను వెళ్లి ఈ రోజుకు 28 ఏళ్లు పూర్తి అయ్యిందని, నిజంగా ఇంతటి అద్భుతమైన జీవితాన్ని, ఈ విలువైన బహుమతిని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని కిచ్చ సుదీప్ క్యాప్షన్‌లో రాశారు.

హీరో సుదీప్ 1996లో బ్రహ్మ అనే సినిమాతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల మొదటి సినిమా బ్రహ్మా ఆగిపోయింది. ఆ తర్వాత తాయవ్వ అనే సినిమాలో నటించి స్యాండిల్ వుడ్ లో వెండితెరకు ఎంట్రీ ఇచ్చాడు. తరువాత స్పర్శ సినిమాతో సుదీప్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కన్నడలో స్పర్శ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇదే సినిమా అదే స్పర్శ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేశారు.

హుచ్చ అనే సినిమాతో తన అద్భుతమైన నటనతో సుదీప్ స్యాండిల్ వుడ్ లో అంతనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మొదట్లో సుదీప్ నటించిన కొన్ని సినిమాలు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు విడుదల అయినా అవి ఆశించినంతగా ఆడలేదు. అప్పట్లో స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులే సుదీప్ ను స్యాండిల్ వుడ్ ఐరన్ లెగ్ అని పిలిచేవారు. అయితే సుదీప్ అవమానాలన్నింటినీ ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగాడు. నేడు స్యాండిల్ వుడ్ లో అభినయ చక్రవర్తి అనే బిరుదు తెచ్చుకున్న సుదీప్ పలువురికి ఆదర్శంగా నలిచారు.

Sandalwood hero Kichcha Sudeep has completed 28 years as an actor

కన్నడలోనే కాకుండా ఇతర బాషల సినిమాల్లో రూడా నటించిన కిచ్చ సుదీప్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని అక్కడా సినీ అభిమానులను ఆకర్షించాడు. ప్రముఖ సినీ నిర్మాతలతో కలిసి పనిచేశారు. బాలీవుడ్ సినిమాల్లోనూ సుదీప్ తలుక్కున మెరిశాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సుదీప్ తన ప్రతిభు చాటుకున్నాడు. మై ఆటోగ్రాఫ్, శాంతి నివాస్, వీర మదకరి, కెంపేగౌడ, మాణిక్య వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుదీప్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

నిర్మాతగా కొన్ని సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మాత్రమే కాకుండా గాయకుడిగా, సమర్పకుడిగా సుదీప్ స్యాండిల్ వుడ్ లో సందడి చేశాడు. కన్నడ టెలివిజన్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ను 10 ఏళ్లుగా నడిపిస్తున్న సుదీప్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. సల్మాన్ ఖాన్ కంటే సుదీప్ నేరేషన్ సూపర్ గా ఉందని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

ఏడాదిన్నర క్రితం సుదీప్ విక్రాంత్ రోణ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు హంగామా చేశారు. సుదీప్ హీరో గా నటిస్తున్న మ్యాక్స్ చిత్రం విడుదల కోసం ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. నటుడిగా ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న హీరో సుదీప్ నేడు హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆయన అభిమానులు కాలర్ ఎగరేసుకుని గర్వంగా తిరుగుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+