మాజీ ప్రధాని ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు, అల్లుడికి సొంత పార్టీలో దిక్కులేదు, మాకు పోటీనా ?

మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అల్లుడు డాక్టర్ మంజునాథ్ వాళ్ల సొంత పార్టీ జేడీఎస్ కాకుండా వేరే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ విషయంలో జేడీఎస్ కార్యకర్తలు తదుపరి నిర్ణయం తీసుకోవాలి అని బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ, కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ అన్నారు. చెన్నపట్టణలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేశ్ మాజీ ప్రధాని దేవేగౌడ ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులోని జయదేవ ఆసుపత్రిలో ఇంతకాలం సేవల అందించిన డాక్టర్ మంజునాథ్ రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నాను అని ఎంపీ డీకే సురేష్ అన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి చెందిన డాక్టర్ మంజునాథ్ అందరికి తెలుసు అని డీకే సురేష్ చెప్పారు. తనకు, తన సోదరుడు డీకే శివకుమార్‌కు రాజకీయాలకు కొత్తేమీ కాదు కాబట్టి మీ సమక్షంలోనే బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో పోటీ జరుగుతుందని, విజయం ఎవరిదో మీరే చూస్తారు కదా అని డీకే సురేష్ మీడియాకు చెప్పారు.

Congress MP DK Suresh made sensational comments about former Prime Minister HD Deve Gowda s family

డాక్టర్ మంజునాథ్ తనకు పోటీ వస్తున్నారని తాను ఏమీ పట్టించుకోను అని డీకే శివకుమార్ చెప్పారు. మాజీ ప్రధాని హెచ్ డీ. దేవెగౌడ, మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిల పార్టీ మీద నమ్మకం లేకపోవడంతో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తి, మాజీ ప్రధాని అల్లుడు డాక్టర్ మంజునాథ్ బీజేపీ టిక్కెట్ తో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయం గురించి జేడీఎస్ కార్యకర్తలు లోతుగా ఆలోచించాలని ఎంపీ డీకే సురేష్ అన్నారు.

మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు డాక్టర్ మంజునాథ్ ఆయన కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా జేడీఎస్ మీద నమ్మకం లేకపోవడం వలనే బీజేపీలోకి వచ్చారని, వేరే పార్టీని ఎంచుకున్న తర్వాత మిగిలిన విషయం తన కార్యకర్తలే తేల్చుకోవాలని, మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని డీకే సురేష్ వ్యంగంగా అన్నారు. జేడీఎస్ ప్రాబల్యం కోల్పోతుందా అనే మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన డీకే సురేష్ దాని గురించి నాకు తెలియదని, జేడీఎస్ కార్యకర్తలకు, ఆ పార్టీ నాయకులకే ఎక్కువగా తెలుసు అని ఎగతాలిగా అన్నారు.

Congress MP DK Suresh made sensational comments about former Prime Minister HD Deve Gowda s family

మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు డాక్టర్ మంజునాథ్ లోక్ సభ ఎన్నికల పోరులో తనకు పోటీగా ఉన్నారని, దేవెగౌడ ఆయన అల్లుడికి ఎలాంటి సలహా ఇచ్చారో మాకు తెలియదని, కానీ మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పెట్టిన పార్టీకి ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లేదని ఆయన కుటుంబంలోని పెద్దలే స్పష్టం చేస్తున్నారని డీకే సురేష్ అన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు డాక్టర్ మంజునాథ్ బీజేపీ టిక్కెట్ తో బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ డీకే సురేష్ మీద పోటీ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+