హిందీ కన్నా ఇంగ్లీష్ మిన్న-బీజేపీ నేతల పిల్లలందరూ చదివేది అదే- రాహుల్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో పలు రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ హిందీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని అల్వార్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్.. ఇంగ్లీష్ కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
అల్వార్ ర్యాలీలో ముందుగా బీజేపీ నేతలపై రాహుల్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు పంపుతారని, స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ వద్దంటారని విమర్శించారు. దేశంలో పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవడం వారికి ఇష్టం లేదని, వారంతా జీవితంలో అభివృద్ధి చెందడం బీజేపీ నేతలకు ఇష్టం లేదన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల వారితో మాట్లాడాలంటే ఇంగ్లీషే పనికొస్తుందని, హిందీ పనికి రాదన్నారు. తాము ఈ దేశంలో రైతులు, పేదల పిల్లలు అమెరికాకు వెళ్లి రాణించాలని కోరుకుంటున్నామని, కాబట్టి హిందీ కంటే
ఇంగ్లీష్ నే వారు నేర్చుకోవాలని కోరుతున్నట్లు రాహుల్ తెలిపారు.

బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకే వెళ్తున్నారని, కానీ పేదలు, రైతుల పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకోనివ్వకుండా హిందీ కోసం వారు పట్టుబడుతున్నారని రాహుల్ విమర్శించారు. వారుపెద్ద పెద్ద కలలు కనకుండా చేస్తున్నారని ఆరోపించారు. అయితే తాను హిందీ, తమిళం వంటి భాషలు నేర్చుకోవద్దని చెప్పడం లేదని, కానీ ప్రపంచంతో కనెక్ట్ కావాలంటే మాత్రం ఇంగ్లీష్ తప్పనిసరి అని గుర్తుచేస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications