CBSE పరీక్షలో స్త్రీ ద్వేష ప్రశ్న- వెనక్కి తీసుకుని క్షమాపణకు లోక్ సభలో సోనియా డిమాండ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కేంద్రం వర్సెస్ విపక్షాలుగా సాగిపోతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా విపక్ష కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధిస్తోంది ఇవాళ కూడా లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ.. కేంద్ర మానవవనరులశాఖతో పాటు సీబీఎస్ఈని టార్గెట్ చేస్తూ ఓ ప్రశ్నను లేవనెత్తారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. మహిళల్ని దూషించేలా ఉన్నా ఓ ప్రశ్నపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఎస్ఈ తాజాగా నిర్వహించిన పదో తరగతి పరీక్షలో స్త్రీలను కించపరిచేలా ఉన్న ఓ ప్రశ్న ఇవాళ పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చింది. విపక్ష కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ దీన్ని లోక్ సభలో ప్రస్తావించారు. ఈ ప్రశ్నను విద్యార్ధులకు ఇచ్చిన సీబీఎస్ఈ దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

గత శనివారం సీబీఎస్ఈ నిర్వహించిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షలో షాకింగ్లీ రెగ్రెసివ్ పాసేజ్ పేరుతో ఓ పేరా ఇచ్చారు. దీనిలో నుంచి ప్రశ్నల్ని సంధించారు. ఇందులో ఓ ప్రశ్నలో ఇళ్లలో యువతీయువకుల చెడు ప్రవర్తనకు స్త్రీవాద తిరుగుబాట్లు, భార్యలు కుటుంబాల్ని వదిలివెళ్లిపోవడం ఎలా కారణమవుతున్నాయో చెప్పండి అంటూ అడిగారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. యువతీయువకుల చెడు ప్రవర్తనకు మహిళల్ని ఎలా కారణంగా చూపుతారనే ప్రశ్నలు వచ్చాయి. ఇలాంటి ప్రశ్నలు సంధించిన సీబీఎస్ఈ బోర్డుపైనా విమర్శలు వచ్చాయి.
దీంతో ఇవాళ లోక్ సభలో ఇదే అంశంపై సోనియాగాంధీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఈ ప్రశ్న పూర్తిగా సభ్యసమాజం ఖండించదగిన ఆలోచనలతో నిండి ఉందని, ఇధి అర్ధంలేనిదని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కఠోరమైన స్త్రీద్వేషపూరిత విషయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సోనియా తెలిపారు. స్త్రీలను ద్వేషించేలా ఉన్న ఈ ప్రశ్నను సంధిచిన సీబీఎస్ఈ వెంటనే దాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని మానవవనరుల మంత్రిత్వశాఖతో పాటు సీబీఎస్ఈని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే దేశంలో విద్యాప్రమాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో అర్ధమవుతోందని సోనియా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications