వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజే అభిశంసన: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం నోటీసులను రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ప్రతాప్‌సింగ్ భజ్వా, అమీ హర్షడ్రే యాజ్నిక్‌లు సోమవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గత మాసంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం నోటీసును రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు అందించారు. అయితే ఈ విషయమై న్యాయ నిపుణుల సలహ తీసుకొన్న తర్వాత ఈ నోటీసును రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు.

Congress MPs move Supreme Court against rejection of CJI impeachment motion notice by Venkaiah Naidu

ఈ అభిశంసన తీర్మాణం నోటీసుపై కాంగ్రెస్‌ పార్టీలో సహ మరో ఆరు పార్టీలకు చెందిన ఎంపీలు సంతకాలు చేశారు. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై వచ్చిన ఆరోపణలపై కనీసం దర్యాప్తు కమిటీనైనా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.

రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ఈ అభిశంసన తీర్మానం నోటీసును తిరస్కరించినందున, దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సోమవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్‌ను కోర్టు స్వీకరిస్తోందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులు, రోస్టర్‌ విధానం తదితర అంశాల్లో సీజేఐ దీపక్‌ మిశ్రా తీరును నిరసిస్తూ నలుగురు సీనియర్‌ జడ్జిలు మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

English summary
Two weeks after Vice-President Venkaiah Naidu rejected the impeachment motion against the Chief Justice of India Dipak Misra citing "no proof of misconduct" by him as alleged by the Opposition parties, two Congress members of Parliament moved the Supreme Court on Monday against the rejection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X