వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేనకు కాంగ్రెస్ ఆఫర్...! ముందుకు వస్తే చర్చిస్తామంటున్న నేతలు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఘ నెలకొంది. మరోవైపు దీంతో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా శివసేనతో అధికారాన్ని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో పాటు ఇరుపార్టీల మధ్య జరగాల్సిన చర్చలు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివసేనకు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచి ఉందని ఆపార్టీ నేత పృధ్వీరాజ్ చౌహన్‌ ప్రకటించారు. శివసేన కాంగ్రెస్ పార్టీతో వచ్చేందుకు అంగీకరిస్తే.. పార్టీ హైకమాండ్‌తో పార్టీ మిత్రపక్ష పార్టీల సభ్యులతో కూడ చర్చిస్తామని చెప్పారు.

మహాలో కుర్చిలాట

మహాలో కుర్చిలాట


మహారాష్ట్రలో సీఎం కుర్చికోసం శివసేన పట్టుపడుతున్న నేపథ్యంలోనే రాజకీయ ప్రతిష్టంభన నెలకోంది. అయితే గత వారం రోజులుగా శివసేనకు అధికారాన్ని ఊరిస్తున్న బీజేపీ తాజాగా ప్లేట్ ఫిరాయించింది. గత ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ రాజకీయ వ్యుహాన్ని అమలు పరుస్తోంది. ఇన్నాళ్లుగా శివసేన జేజారీపోకుండా ఊరిస్తూ వచ్చి బీజేపీ హైకమండా తాజాగా ఆపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫడ్నవిస్‌తో ప్రకటన చేయించింది. శివసేనతో 50-50 అధికారాన్ని పంచుకోవడంపై ఎలాంటీ ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. దీంతో మరోసారి శివసేనకు మొండిచేయి చూపించింది.

శివసేనకు ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్

శివసేనకు ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్

దీంతో శివసేనకు అటు కాంగ్రెస్ పార్టీ గాళం వేస్తోంది. అధికారం పంచుకునేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేత పృధ్విరాజ్ చౌహాన్ ప్రకటించారు. శివసేన ముందుకు వస్తే పోత్తుల అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో పాటు తన మిత్రపక్ష పార్టీతో చర్చిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇరుపార్టీలపై కూడ ఆయన విమర్శలు చేశారు. ఇరుపార్టీల మధ్య జరిగిన ఒప్పందాన్ని ప్రజలు తెలియజేయాలని అన్నారు. ఇప్పుడే ఇరు పార్టీల నేతల మధ్య అపనమ్మకంతో ఉంటే భవిష్యత్‌లో అధికారాన్ని కొనసాగిస్తారని ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

శివసేన ,బీజేపీల మధ్య చర్చలకు బ్రేక్

శివసేన ,బీజేపీల మధ్య చర్చలకు బ్రేక్

కాగా శివసేనతో కలిసేందుకు ఏన్సీపీ నేతలు సిద్దంగా లేమని ప్రకటించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటన మరో ఉత్కంఠను రేపింది. మరోవైపు మంగళవారం సాయంత్రం పోత్తుల అంశంపై బీజేపీతో చర్చలు జరగాల్సి ఉండగా వాటిని శివసేన రద్దు చేసుకోంది. ఫిఫ్టి ఫిప్టి ఆఫర్‌ను అమిత్ షా తుంగలో తొక్కినప్పుడు తాము ఆ పార్టీకి ఎందుకు మద్దతు పలకాలని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నట్టు చెప్పారు. దీంతో ఇరు పార్టీల మధ్య జరగాల్సిన చర్చలు రద్దు చేశామని చెప్పారు. ఇక అధికారం కోసం ఇరుపార్టీల మధ్య చర్చలు జరగే అవకాశాలు కూడ తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు.

English summary
in case Shiv Sena comes with a proposal amid the Sena-BJP 50:50 ongoing tussle in Maharashtra party high command and allies will be discussed congress said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X