Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సీ, ప్లాన్ డి సిద్దం చేసిన హైకమాండ్, నేడు సీఎం పేరు డిసైడ్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు ? అనే టెన్షన్ లో కన్నడిగులు ఉన్నారు. సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని సిద్దూ సేన, డీకే శివకుమార్ ను సీఎం చెయ్యాలని డీకేశీ సేన డిమాండ్ లు చేస్తున్నారు. అయితే మధ్యలో మూడో వ్యక్తి సీఎం సీటు తన్నుకుపోతే ఎలా ? అనే ఆనుమానం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మొదలైయ్యింది.

కర్ణాటకలోని 135 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫైనల్ గా సీఎం ప్రకటించడానికి సిద్దం అవుతోంది. సిద్దరామయ్యను సీఎం చేస్తే డీకే శివకుమార్ ఎలా స్పందిస్తారు. డీకే శివకుమార్ ను సీఎం చెయ్యాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్పందిస్తారు ? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది.

AICC has decided to finalize the CMs name.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర ప్లాన్-ఏ, ప్లాన్- బి, ప్లాన్- సి, ప్లాన్ డీ ఉన్నాయని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్లాన్- ఏ ప్రకారం సిద్దరామయ్యను సీఎం చేసి ముగ్గురు డీసీఎంలను చెయ్యాలని ఉంది. ఒక్కలిగ నుంచి డీకే శివకుమార్, లింగాయత్ ల నుంచి ఎంబీ. పాటిల్, దళిత వర్గానికి చెందిన డాక్టర్ జీ. పరమేశ్వర్ ను ఉప ముఖ్యమంత్రులు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది.

AICC has decided to finalize the CMs name.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్లాన్- బి ప్రకారం డీకే. శివకుమార్ ను సీఎం చేసి ముగ్గురు డీసీఎంలను చెయ్యాలని ఉందని తెలిసింది. వెనుకబడిన వర్గాల నుంచి సిద్దరామయ్య, లింగాయత్ ల నుంచి ఎంబీ. పాటిల్, దళిత వర్గానికి చెందిన డాక్టర్ జీ. పరమేశ్వర్ ను ఉప ముఖ్యమంత్రులను చెయ్యాలని ఉంది. అయితే ఇప్పటికే ఐదు ఏళ్లు సీఎంగా పని చేసిన సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరిస్తారా ?, ఆయన ఆపదవిలో ఉండటానికి ఆయన అభిమానులు అంగీకరిస్తారా అనే అనుమానం కాంగ్రెస్ హైకమాండ్ కు పట్టుకుంది.

ఇక ప్లాన్ సీ ప్రకారం కర్ణాటకలో 50-50 ఫార్ములాను ప్రయోగించాలని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో, సీఎంగా పని చేసిన సిద్దరామయ్యకు అనుభవం ఉందని, ముందుగా రెండున్నర సంవత్సరాలు ఆయన్ను సీఎం చెయ్యాలని, తరువాత రెండున్నర సంవత్సరాలు డీకే. శివకుమార్ ను సీఎం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని తెలిసింది. అయితే రాజీ సూత్రానికి డీకే శివకుమార్, సిద్దరామయ్య అంగీకరిస్తారా అనే అనుమానం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఉంది.

AICC has decided to finalize the CMs name.

ప్లా డీ ప్రకారం సిద్దరామయ్య కారణంగా కర్ణాటకలో 80 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయని, డీకే శివకుమార్ ప్రభావం బెంగళూరు, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో మాత్రమే ఉందని, అందుకే సిద్దరామయ్యను సీఎం చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అందుకు డీకే శివకుమార్ ను ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని తెలిసింది.

నాలుగు ప్లాన్ లు సిద్దం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో మాత్రమే చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యిందని తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో విడివిడిగా చర్చించారని తెలిసింది. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుంటారని, సోమవారమే సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+