హైకమాండ్ దెబ్బకు సిద్దూ. డీకేకి మైండ్ బ్లాక్, క్లైమాక్స్ లో 12 మంది ఔట్, ఆయనకు !
బెంగళూరు/ న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అయితే సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది.
సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం అయ్యింది. సిద్దరామయ్య వర్గంలో 10 మంది, డీకే శివకుమార్ వర్గంలో 10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో మ్యాటర్ మొత్తం రివర్స్ అయ్యింది.

సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ శనివారం ఉదయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమీర్ అహమ్మద్ ఖాన్ కు మంత్రి పదవి రాకుండా అడ్డుపడిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న 8 మంది మంత్రులల్లో చివరి పేరు జమీర్ అహమ్మద్ ఖాన్ పేరు ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ 8 మంది పేర్లు ఫైనల్ చేసిందని తెలిసింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వర్గంలోని వారికి మంత్రి పదవులు దక్కాయి.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు:
* డాక్టర్ జీ. పరమేశ్వర్
* కేహెచ్ మునియప్ప
* కేజే. జార్జ్
* ఎంబీ పాటిల్
* సతీష్ జారకిహోళి
* ప్రియాంక ఖార్గే
* రామలింగా రెడ్డి
* జమీర్ అహమ్మద్ ఖాన్, ఈయనకే డీకే శివకుమార మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారని జోరుగా ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications