వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ రిజల్ట్స్: 150 సీట్ల టార్గెట్‌‌‌కు దూరంగా బిజెపి, కారణమిదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

టార్గెట్‌‌‌కు దూరంగా బిజెపి, కారణమిదే

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆరో దఫా విజయం సాధించింది.అయితే గతంలో కంటే తక్కువ సీట్లలో ఈ దఫా బిజెపి విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కుల రాజకీయాల వల్లే తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్టు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు.

రాహుల‌్‌కు షాక్: సూరత్, వడోదర, అహ్మదాబాద్‌ల్లో బిజెపిదే హవా, నో జీఎస్టీ ఎఫెక్ట్రాహుల‌్‌కు షాక్: సూరత్, వడోదర, అహ్మదాబాద్‌ల్లో బిజెపిదే హవా, నో జీఎస్టీ ఎఫెక్ట్

గుజరాత్ రాష్ట్రంలో బిజెపి విజయం సాధించింది. అయితే గుజరాత్‌లో బిజెపి విజయం సాధించడం కంటే కాంగ్రెస్ పార్టీ గతం కంటే పుంజుకోవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకొందని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

గుజరాత్‌లో వరుసగా ఆరోసారి బిజెపి గెలుపు:బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ రికార్డు‌ సమం చేసేనా?గుజరాత్‌లో వరుసగా ఆరోసారి బిజెపి గెలుపు:బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ రికార్డు‌ సమం చేసేనా?

అయితే ఈ దఫా గుజరాత్ ఎన్నికల్లో 150 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని బిజెపి రంగంలోకి దిగింది. కానీ, 99 స్థానాలకే బిజెపి పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీని బిజెపి సాధించింది. కానీ, కాంగ్రెస్ పుంజుకోవడాన్ని మాత్రం నిలువరించలేకపోయింది.

150 సీట్ల మిషన్‌ చేరకపోవడానికి కారణమిదే

150 సీట్ల మిషన్‌ చేరకపోవడానికి కారణమిదే

గుజరాత్ రాష్ట్రంలో 150 అసెంబ్లీ సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో బిజెపి ఎన్నికల రంగంలోకి దిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధానమంత్రి మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తదితరులు గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. గుజరాత్ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లనే కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కుల రాజకీయాల కారణంగానే తాము అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

ప్రచారాన్ని దిగజార్చిన కాంగ్రెస్

ప్రచారాన్ని దిగజార్చిన కాంగ్రెస్

2012లో గుజరాత్ రాష్ట్రంలో బిజెపి 115 సీట్లను కైవసం చేసుకొంది. 2017 ఎన్నికల్లో బిజెపి 99 స్థానాలకు మాత్రమే పడిపోయింది. అయితే రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా సుమారు 8 శాతంగా ఉంది. ఈ పరిణామాలు రాజకీయంగా బిజెపిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని దిగజార్చిన కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

కుల రాజకీయాలను తిప్పికొట్టారు

కుల రాజకీయాలను తిప్పికొట్టారు

గుజరాత్ రాష్ట్రంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు పాల్పడిందని బిజెపి అభిప్రాయపడింది.కులాల పరంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను రెచ్చగొట్టిందని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే గుజరాత్‌లో కాంగ్రెస్ కొంత పుంజుకోగల్గిందని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకొన్న కాంగ్రెస్

గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకొన్న కాంగ్రెస్

గ్రామీణ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకొంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి ఎక్కువగా విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో తక్కువ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకొంది.

English summary
Celebrating the BJP's freshly-minted "historic victory" in Gujarat, Prime Minister Narendra Modi and BJP chief Amit Shah on Monday accused the Congress for trying to sow the seeds of casteism in its hunger for power and asked voters to be vigilant of renewed attempt by "some people" to keep up the effort in future too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X