Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తుగ్డే తుగ్డే గ్యాంగ్ లీడర్, బ్రిటిష్ వారి విధానమే: కాంగ్రెస్ సహా విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంటులో సమావేశాల్లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. దేశంలో జరుగుతున్న అనేక ఎన్నికల్లో ఓడిపోతున్నా.. కాంగ్రెస్ నేతలకు అహంకారం మాత్రం తగ్గడం లేదని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని లోక్‌సభలో మాట్లాడారు.

కరోనా కాలంలో కాంగ్రెస్ హద్దులు దాటింది: మోడీ ఆగ్రహం

కరోనా కాలంలో కాంగ్రెస్ హద్దులు దాటింది: మోడీ ఆగ్రహం


అనేక రాష్ట్రాల్లో ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ పార్టీలో మార్పు రావడం లేదన్నారు. ఒడిశా, గోవా, నాగాలాండ్ ప్రజలు 25 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీని వెళ్లగొట్టారని.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని గుర్తు చేశారు. దేశంలో కరోనా వైరస్ తొలిదశలో వైరస్ వ్యాప్తికి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కరోనా ప్రారంభ దశలో కాంగ్రెస్ పార్టీ అన్ని పరిధులూ దాటిందనీ.. కోవిడ్ వైరస్ దేశమంతా వ్యాపించడానికి వలసకూలీల సంక్షోభానికి ఆ పార్టీ నేతలే కారణమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా తొలినాళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలన్న సూచనతో తాము లాక్‌డౌన్ ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతలు ముంబై రైల్వేస్టేషన్లో వలసకూలీలకు ఉచితంగా రైలు టికెట్లు ఇచ్చి కోవిడ్ వ్యాప్తికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. వలస కూలీలను కష్టాల్లోకి నెట్టారంటూ ఢిల్లీ సీఎం సహా పలు బీజేపీయేతర పార్టీల పాలకులపై మండిపడ్డారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు మురికివాడల్లోకి మైక్ లతో వెళ్లి.. వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేసి పంపించిందన్నారు. ఇలాంటి చర్యలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయని మోడీ ధ్వజమెత్తారు.

మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర

మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర

కరోనా కాలంలో తన ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు కుట్రలు పన్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. తాను వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడితే దాన్ని పట్టించుకోలేదన్నారు. భారత్ స్వయం సమృద్ధి దేశంగా అవతరించాల్సిన అవసరం లేదా? గాంధీజీ కలలు సాకారం కావడం మీకు ఇష్టం లేదా? అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు ప్రధాని మోడీ. 'ఇప్పుడు మీరు మరో 100ఏళ్లు అధికారంలోకి రాలేమని ఫిక్స్ అయిపోండి' అని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలను కాంగ్రెస్ ఎందుకని అడ్డుకుంటుందని ప్రశ్నించారు. 'నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ, ఫిట్ ఇండియా మూమెంట్, ఇతర స్కీంలను ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? మీకు ఓట్లు రాక చాలా ఏళ్లు గడిచాయని మర్చిపోవద్దు' అని పీఎం మోడీ చురకలంటించారు.

130 కోట్ల ప్రజలకు అండగా ఉన్నాం: ప్రధాని మోడీ

130 కోట్ల ప్రజలకు అండగా ఉన్నాం: ప్రధాని మోడీ

కరోనా కాలంలో దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరాదని 80 కోట్ల మందికిపైగా ఉచిత రేషన్, ధాన్యం పంపిణీ చేశామన్నారు. ఈరోజు భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. కోవిడ్ కాలంలో కూడా మనదేశ మొత్తం ఎగుమతులు అధికంగా ఉన్నాయన్నారు ప్రధాని మోడీ. కరోనా కాలంలో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా.. కొందరు వ్యక్తులు తమ బానిస మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. జీవితాంతం రాజభవనాల్లో ఉండేవారికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు ఫైల్స్ ముఖ్యం కానీ.. తమకు దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు ముఖ్యమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

మరో వందేళ్లు కాంగ్రెస్ అధికారానికి దూరమే..

మరో వందేళ్లు కాంగ్రెస్ అధికారానికి దూరమే..

కరోనా కాలంలోనూ భారత ఆర్థి వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని ప్రధాని మోడీ తెలిపారు. 2014లో 500 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 60వకేలకు చేరిందన్నారు. పారిశ్రామికవేత్తలు కరోనా వేరియంట్లు అని మాట్లాడే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. మేకిన్ ఇండియా ద్వారా అనేక దిగ్గజ పరిశ్రమలో మనదేశంలోనే ఉత్పత్తి ప్రారంభించాయని, మేకిన్ ఇండియాని ఎగతాళి చేసిన వారే జోక్‌గా మారిపోయారిన రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో వందేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమేనని అన్నారు.

తుక్గే తుక్డే గ్యాంగ్ లీడర్ అంటూ కాంగ్రెస్‌పై మోడీ ఫైర్

అంతేగకా, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తుక్గే తుక్గే గ్యాంగ్‌కు నాయకత్వం వహిస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్ విధానమే గతంలో బ్రిటిష్ వారు అనుసరించిన 'విభజించు పాలించడం' అని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తమను అడ్డుకోలేకే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారన్నారు. కానీ, తమను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమిళ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిందని మండిపడ్డారు. దేశాన్ని విడగొట్టి పాలించడం వారి డీఎన్ఏలోనే ఉందని మోడీ ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+