సోనియాగాంధీకి అస్వస్థత: వైరల్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చేరిక

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం కారణంగా గతకొంతకాలంగా ఆమె అస్వస్థకు లోనవుతూ వస్తున్నారు. గత మూడు నెలల్లో సోనియా ఆసుపత్రిలో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Congress President Sonia Gandhi down with viral fever, admitted to hospital in Delhi

గత అగస్టు 03వ తేదీన జ్వరం, డీహైడ్రేషన్, భుజం నొప్పి కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరారు సోనియా. అంతకుముందు రోజు వారణాసి లో నిర్వహించిన పార్టీ రోడ్ షోలోపాల్గొన్న ఆమె.. అనారోగ్యం కారణంగా మధ్యలోనే తప్పుకున్నారు. కాగా, కూతురు ప్రియాంక వాద్రా కుటుంబంతో కలిసి షిమ్లాకు వెళ్లిన సోనియా.. గత వారమే ఢిల్లీకి తిరిగొచ్చారు.

ప్రస్తుతం సోనియాకు వైద్య పరీక్షలు కొనసాగుతుండగా.. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్యులు చెబుతున్నట్టుగా సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress President Sonia Gandhi was today admitted to Sir Ganga Ram Hospital in Delhi as she's reportedly suffering from viral fever.
Please Wait while comments are loading...