సీజ్ ఫైర్ లో ట్రంప్ జోక్యం ఉందా లేదా ? ఇప్పటికైనా చెప్పండి- మోడీకి కాంగ్రెస్ ప్రశ్నలు..!
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జోరుగా సాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణపై ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇరు దేశాలూ కాల్పుల విరమణ ప్రకటించాయి. కానీ ట్రంప్ జోక్యంతో అని మాత్రం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాయి. కానీ ట్రంప్ మాత్రం తాను ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని అడ్డుపెట్టి కాల్పుల విరమణకు అంగీకరింపజేసినట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు.
అయినా భారత ప్రధాని మోడీ మాత్రం మౌనంగా ఉండిపోవడాన్ని విపక్ష కాంగ్రెస్ పదే పదే ప్రశ్నిస్తోంది. ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారని ఇవాళ మరోసారి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, సీనియర్ నేత పవన్ ఖేరా మరోసారి ప్రశ్నించారు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన వివాదాన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను మోడీ ఇప్పటివరకూ తిరస్కరించలేదన్నారు.

ఈ ఉరుములతో కూడిన నిశ్శబ్దం ఎందుకని ప్రధాని మోడీని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. 11 రోజుల్లో ఎనిమిది సార్లు, అధ్యక్షుడు ట్రంప్ భారతదేం,పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని ప్రకటించారని, ఇరుదేశాల ప్రధానులను సమానంగా ప్రశంసించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ గుర్తుచేశారు. రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించేలా చేయడానికి అమెరికాతో వాణిజ్యం తాను ఉపయోగించిన సాధనమని పదే పదే చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ కూడా అయిన జైరాం రమేష్ అన్నారు.
आज बीकानेर में जिस तरह प्रधानमंत्री ने एक बार फिर फिल्मों जैसे खोखले डायलॉग्स का सहारा लिया, उससे कहीं ज्यादा जरूरी है कि वे उन गंभीर सवालों का जवाब दें जो देश उनसे पूछ रहा है-
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 22, 2025
1. पहलगाम के निर्दयी हत्यारे अब तक खुले क्यों घूम रहे हैं? कुछ रिपोर्ट्स के मुताबिक यही आतंकी गिरोह…
మన ప్రధానమంత్రి -డొనాల్డ్ భాయ్ కి గొప్ప స్నేహితుడని జైరాం రమేశ్ తెలిపారు. కానీ అమెరికా అధ్యక్షుడు పదే పదే చెబుతున్న దానిపై పూర్తిగా మౌనంగా ఉన్నారన్నారు. అమెరికా అధ్యక్షుడి వాదనలకు మద్దతుగా, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య చర్చలకు తటస్థ వేదిక గురించి తన స్నేహితుడు, అమెరికా విదేశాంగ కార్యదర్శి చెప్పిన దానిపై విదేశాంగ మంత్రి కూడా పూర్తి మౌనాన్ని కొనసాగిస్తున్నారని జైరాం రమేశ్ ఎక్స్ లో చేసిన పోస్టులో ఆరోపించారు.












Click it and Unblock the Notifications