ఈడీ, సీబీఐలకు బెదరను.. మోదీ మాట నేనెందుకు వినాలి ? : ప్రధానికి రాహుల్ గాంధీ కౌంటర్
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆపార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తానేంటో మోదీకి తెలిసిపోయిందన్నారు. తనపై ఈడీ, సీబీఐలను ప్రయోగించినా పనిచేయవని.. వాటికి తాను బెదిరేది లేదన్న సంగతి ప్రధానికి అర్థమైపోయిందన్నారు. మోదీ అహంకారాన్ని చూస్తే నవ్వొస్తోందంటూ సెటైర్లు విసిరారు. దేశాన్ని నాశం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

నేనెందుకు మోదీ మాటలు వినాలి
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి తన దగ్గర పనిచేయదని తేల్చిచెప్పారు. తాను మాట విననని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే సీబీఐ, ఈడీ వంటి దర్వాప్తు సంస్థలను ఉసిగొల్పినా ఈ రాహుల్ గాంధీ దగ్గర పనిచేయవని అర్థం అంటూ మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆటలు నా దగ్గర సాగవని మోదీకి తెలిసిపోయిందని పేర్కొన్నారు. అసలు నేనెందుకు మోదీ మాటలు వినాలని ప్రదానిపై మండిపడ్డారు.

దేశంలో పేదవాడు బతికే పరిస్థితి లేదు
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దేశాన్ని.. రెండుగా చేసిందని రాహుల్ మండిపడ్డారు . ఒక పేద దేశం కాగా.. రెండోది ధనిక దేశంగా చేసిందని విమర్శించారు. పేదలను ముంచి .. పెద్దలకు సంపదను కట్టబెడుతుందని దుయ్యబట్టారు. దేశంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశాన్ని నాశం చేశారు.
మన పొరుగు ఉన్న చైనా మనదేశ భూభాగాన్ని ఆక్రమించినా.. ప్రధాని మోదీ మాతరం ఏమీ చేయట్లేదని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు చేసి దేశాన్ని నాశం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు సమయంలో ఏ కోటీశ్వరుడైనా లైన్లో నిల్చున్నారా ? మోదీని నిలదీశారు. జీఎస్టీ అమలు చేసి సర్వనాశం చేసిందని మండిపడ్డారు. జీఎస్టీ అమలుతో లక్షలాది మంది ఉద్యోగ , ఉపాధిని కోల్పోయారని ద్వజమెత్తారు. తమ పాలనలో లక్షాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని తెలిపారు. కానీ మోదీ ప్రభుత్వం యువతను, పేదలను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications