గోవా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే; రంగంలోకి సోనియా గాంధీ; 30మందితో జాబితా

గోవాలో ఫిబ్రవరి 14 తారీఖు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి వ్యూహాత్మకంగా వెళుతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచార రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఈరోజు రాహుల్ గాంధీ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సోనియా గాంధీ నేతృత్వంలోని 30-స్టార్ పార్టీ ప్రచారకుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

స్టార్ క్యాంపెయినర్ ల జాబితాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీకే శివకుమార్, సతీష్ జార్కిహోళి, ఎం బి పాటిల్, మల్లికార్జున్ ఖర్గే , సిద్ధరామయ్య తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు. గోవా రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్టార్ క్యాంపెయినర్లు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటారని పార్టీ అగ్ర వర్గాల సమాచారం. ఎమ్మెల్యే దినేష్ గుండూరావు, పి.చిదంబరం నేతృత్వంలోని పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా గోవాలో మకాం వేసి క్రమం తప్పకుండా ర్యాలీలు, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గోవాలో ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు

స్టార్ క్యాంపెయినర్లుగా జాబితాలో ఉన్న వారు వీరే

స్టార్ క్యాంపెయినర్లుగా జాబితాలో ఉన్న వారు వీరే

గోవాలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లు గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే, పి చిదంబరం, దినేష్ గుండూరావు, గిరీష్ చోడంకర్, దిగంబర్ కామత్, ఫ్రాన్సిస్కో సర్దిన్హా, రణదీప్ సూర్జేవాలా, అశోక్ గెహ్లాట్, ఊమెన్ చాందీ, సిద్ధరామయ్య, అశోక్ చవాన్, సచిన్ పైలట్, రమేష్ చెన్నితల, డికె శివకుమార్, శశి థరూర్, హెచ్‌కె పాటిల్, ఎంబి పాటిల్, రమాకాంత్ ఖలప్, అమిత్ దేశ్‌ముఖ్, నానా పటోలే, యశోమతి ఠాకూర్, ఆర్‌వి దేశ్‌పాండే, సతీష్ జార్కిహోలి, కన్హయ్య కుమార్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, నెట్టా డిసౌజా, బివి శ్రీనివాస్ ల పేర్లను ప్రకటించారు.

 గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినా అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్

గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినా అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్

గత అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి 13కి వ్యతిరేకంగా 17 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది బిజెపికి మారడంతో పార్టీ తీవ్రమైన ఫిరాయింపులను చూసింది. అయితే, గోవాలో స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరైన కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ జార్కిహోళి ఈసారి పార్టీ మరో మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందని అంటున్నారు.

 ఇప్పటికే గోవాలో క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలు

ఇప్పటికే గోవాలో క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలు

గోవాలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ప్రచారంలో సమర్థవంతంగా పని చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం సంకల్పించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. డీకే శివకుమార్, సతీష్ జార్కిహోళి, లక్ష్మీ హెబ్బాల్కర్, దినేష్ గుండూరావు మరియు పార్టీ నాయకులు పలువురు ఇప్పటికే రాష్ట్రంలోని అనేక అసెంబ్లీ సెగ్మెంట్లను సందర్శించి గత నెల రోజులుగా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు . జార్కిహోళి పార్టీ ప్రచారం కోసం తన ప్రత్యేక వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గోవా రాష్ట్రంలోని ఉత్తర మరియు దక్షిణ జిల్లాలు రెండింటిలోనూ క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+