లోక్‌సభలో విపక్ష నేతగా రవ్‌నీత్ బిట్టూ-బెంగాల్ ఎన్నికల్లో అధిర్ రంజన్ బిజీ
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై పడింది. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష నేతగా ఉన్న అధిర్ రంజన్ చౌధురి పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో ఎన్నికల వేళ ఆయన బెంగాల్‌ను వీడి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనలేని పరిస్దితి. దీంతో ఆయన స్ధానంలో కాంగ్రెస్ పార్టీ రవ్‌నీత్ సింగ్ పేరును ప్రతిపాదించింది. దీంతో స్పీకర్ బిట్టూకు విపక్ష నేత హోదా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విచిత్రంగా లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న బెంగాల్ కాంగ్రెస్ ఛీఫ్ స్వరాష్టంలో ఎన్నికల్లో బిజీగా ఉండగా, డిప్యూటీ నేత గౌరవ్ గగోయ్ కూడా అస్సోం ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. దీంతో వీరిద్దరి గైర్హాజరీలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రవ్‌నీత్ సింగ్ బిట్టూకు విపక్ష నేతగా బాధ్యతలు దక్కాయి. 2009 నుంచి వరుసగా మూడుసార్లు పంజాబ్ నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి ఎంపీగా గెలిచిన బిట్టూ, అనంతరం 2014, 2019లో లుథియానా నుంచి విజయం సాధించారు.

ఢిల్లీలో రైతుల ఆందోళనలో బిట్టూ కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. సింఘూ సరిహద్దుల్లో ఆయనపై ఓసారి దాడి కూడా జరిగింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక పంజాబ్ యూత్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో గెలిచిన తొలి నేత కూడా బిట్టూనే. 2009లో పంజాబ్ యూత్ కాంగ్రెస్ ఛీఫ్‌గా డ్రగ్స్‌పై బిట్టూ గట్టిగా పోరాడారు. ఆ తర్వాత ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. రవ్‌నీత్ సింగ్ బిట్టూ పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు కూడా. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను గతేడాది ఆగస్టులో లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించింది. రవ్‌నీత్ సింగ్ బిట్టూకు లోక్‌సభలో విపక్ష నేతగాబాధ్యతలు దక్కడం పట్ల పంజాబ్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది.
Congratulations to Member of Parliament from Ludhiana @RavneetBittu Ji for being appointed as Leader of Opposition in Lok Sabha. pic.twitter.com/hxXmXmMlFC
— Punjab Congress (@INCPunjab) March 11, 2021












Click it and Unblock the Notifications