కాంగ్రెస్ ‘వార్ రూం’లోకి బాలీవుడ్ బ్యూటీ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వార్ రూంగా పేరొందిన భవనాన్ని ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు రేఖకు అధికారిక నివాసంగా కేటాయించారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని రకబ్ గంజ్‌లోని ఓ ఇంటిని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాల నిర్వహణకు వినియోగిస్తుంటుంది.
ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆ భవనానికి నిరంతరం వచ్చిపోతుంటారు. దీంతో ఆ భవనాన్ని కాంగ్రెస్ వార్ రూంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడీ భవనాన్ని పార్లమెంటు సభ్యురాలు రేఖకు అధికారిక నివాసంగా అధికారులు కేటాయించారు.

దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భవనాన్ని రేఖకు నివాసంగా కేటాయించిన విషయం తమ పార్టీకి తెలియదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అవసరమైతే తాము వేరే చొట చర్చలు జరుపుకుంటామని చెప్పారు.
తెలంగాణకు చెందిన రాజ్యసభ ఎంపీ పేరున కేటాయించడిన ఈ భవనాన్ని నిన్నటి( బుధవారం) వరకు కాంగ్రెస్ పార్టీ తమ వార్ రూంగా వినియోగించింది. 2009, 2014 లోకసభ ఎన్నికల సందర్భాల్లో ఈ భవనంలోనే కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications