ఇదీ బీజేపీ మైండ్ సెట్, 'స్త్రీ'లపై ఇలాంటి రాతలా?: యోగి క్షమాపణ చెప్పాల్సిందే!

Subscribe to Oneindia Telugu

లక్నో: యోగి ఆదిత్యనాథ్ లాంటి ఓ మతతత్వ వాదిని సీఎంగా నియమించడమేంటని బీజేపీపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న ఆయన తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. తన వెబ్ సైట్ 'యోగి ఆదిత్యనాథ్ టాట్ ఇన్' లో మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఇదే విషయాన్ని లేవనెత్తుతూ మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని యోగి ఆదిత్యనాథ్‌ను కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ యోగి వెబ్ సైట్ లో ఏం రాశారంటే.. 'మహిళా శక్తిని చిన్నతనంలో తండ్రి, వయసు వచ్చిన తరువాత భర్త, వృద్ధాప్యంలో కుమారుడు రక్షించాలి. మహిళలను స్వతంత్రంగా, స్వేచ్ఛగా వదిలివేయరాదు' అని పేర్కొన్నారు.

Congress seeks apology from Yogi Adityanath for ‘anti-women’ remarks

నిజానికి ఈ వ్యాఖ్యలన్ని మనుధర్మ శాస్త్రంలో పేర్కొన్నవే. పితృస్వామ్య భావజాలాన్ని పెంపొందించేలా 'న స్త్రీ స్వాతంత్రమనర్హతి' అంటూ అందులో పేర్కొన్న భావాలను యోగి లాంటి సీఎం తన వెబ్‌సైట్‌లో రాయడమేంటనే దానిపై వివాదం మొదలైంది.

సభల్లో, ప్రసంగాల్లో నిత్యం మహిళల సాధికారత అంటూ చెప్పుకొచ్చే యోగి.. తన వ్యాసంలో బీజేపీ మైండ్ సెట్ బయటపెట్టుకున్నారని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాల విమర్శించారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం శోచనీయమన్నారు.

'యోగి ఆదిత్యనాథ్ టాట్ ఇన్' వెబ్ సైట్ వీక్లీ జర్నల్ లో.. కామెంట్ సెక్షన్ లోని మొదటి స్థానంలో ఉన్న ఓ ఆర్టికల్ లో యోగి ఆదిత్యనాథ్ మహిళలను కించపరిచే రాతలు రాసినట్లుగా సుర్జేవాలా ఆరోపించారు. తక్షణం ఆ రాతలను తొలగించి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆర్టికల్ ఎప్పుడు అప్ లోడ్ చేసి ఉంటారన్నది ఇంకా తెలియరాలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Congress on Monday accused Uttar Pradesh Chief Minister Yogi Adityanath of making ‘disparaging, distatateful and dishonourable’ remarks against country’s women on his website and demanded an apology from him. The party also said Prime Minister Narendra Modi and Bharatiya Janata Party
Please Wait while comments are loading...