కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీతో ట్విటర్ మిలాఖత్ -రాహుల్ గాంధీ సహా 5వేల అకౌంట్ల రద్దుపై ప్రియాంక ధ్వజం
సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోదీ చేతిలో బొమ్మలా ట్విటర్ పిట్ట తయారైందని మండిపడ్డాయి. రైతుల నిరసనలు, కరోనా విపత్తు నిర్వహణలో వైఫల్యం అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విపక్షాలకు అనుకూలంగా వ్యవహరించిదని ఆరోపణలు ఎదుర్కొన్న ట్విటర్.. ఐటీ చట్టాల విషయంలో ఏకంగా కేంద్రంతో యుద్ధానికే దిగింది. అలాంటిదిప్పుడు రాహుల్ గాంధీ సహా వేలాది మంది కాంగ్రెస్ నేతల ట్విటర్ ఖతాలను బ్లాక్ చేయడం రచ్చకు దారితీసింది..

మోదీ చేతిలో బొమ్మలా ట్విటర్
కాంగ్రెస్ పార్టీ అధికార ఖాతాతోపాటు రాహుల్ గాంధీ ఇతర నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలకు ట్విట్టర్ ఇండియా లాక్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. ట్విట్టర్ తన సొంత నియమాలను పాటిస్తోందా లేదంటే మోదీ ప్రభుత్వ నియమాలు పాటిస్తోందా అంటూ గురువారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఖాతాలను ఉమ్మడిగా మూసివేయడంలో పెద్ద కుట్ర ఉందని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వంతో ట్విట్టర్ జతకట్టిందని అనుకోవచ్చని ప్రియాంక గాంధీ అన్నారు.

ప్రియాంక ఖాతాకు రాహుల్ డీపీ
అకౌంట్ల రద్దు విషయంలో ట్విటర్ తీరును తప్పు పట్టిన ప్రియాంక గాంధీ, తన అధికారిక ట్విటర్ ఖాతాలో రాహుల్ గాంధీ చిత్రాన్ని డిస్ ప్లే ఫొటోగా పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ''కాంగ్రెస్ నేతల ఖాతాలకు లాక్ వేయడానికి ట్విట్టర్ తన సొంత పాలసీలను పాటించిందా లేదంటే మోదీ ప్రభుత్వ పాలసీలను పాటించిందా? ఒకవేళ సొంత పాలసీలు పాటిస్తే కాంగ్రెస్ నేతలు షేర్ చేసినటువంటి ఫొటోలనే సుప్రీంకోర్టు కమిషన్ షేర్ చేసింది. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కాంగ్రెస్ నేతల ఖాతాలను మూకుమ్మడిగా లాక్ చేయడాన్ని బట్టి చూస్తే దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వంతో ట్విట్టర్ చేతులు కలిపిందని అనుకోవచ్చు'' అని ప్రియాంక గాంధీ రాసుకొచ్చారు.

కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..
ఢిల్లీలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిసిన సందర్భంలో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియో ట్విటర్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని ప్రకటించిన సంస్థ.. ఆగస్టు 6న ఆయన అకౌంట్ ను లాక్ చేసింది. వేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ అధికారిక ఖాతాను కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఖాతాలకు లాక్ వేశారు. ఇందులో వెరిఫైడ్ ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఖాతాకు లాక్ వేస్తే వేల మంది రాహుల్ గాంధీలు వస్తారని, ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటారని యూత్ కాంగ్రెస్ అధినేత శ్రీనివాస్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. అంతే కాకుండా తన ఖాతాకు రాహుల్ గాంధీ అని పేరు మార్చి ట్విట్టర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

కాషాయం పూసుకున్న పిట్ట..
ఇక కొందరైతే ట్విట్టర్ పిట్టకు కాషాయం రంగు పూసి, 'సంఘీ ట్విట్టర్' అంటూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, బాధితులకు న్యాయం చేయమని అడగడం, ప్రభుత్వ తప్పిదాల్ని బహిరంగ పర్చడం కూడా తప్పేనా అంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ మండిపడింది. 'ట్విట్టర్ మోదీ సే డర్ గయా' (మోదీకి ట్విట్టర్ భయపడింది) అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌కు రాహుల్ గాంధీకి మోదీ భయపడుతున్నారని, అందుకే రాహుల్ సహా కాంగ్రెస్ నేతల గొంతును అడ్డుకుంటున్నారని మరికొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్విటర్ సీఈవోపైనా విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాతోపాటు మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ట్విటర్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పార్టీ నేత ప్రణవ్ ఝా ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సేపై విమర్శలు గుప్పించారు. తమ సీనియర్ నేతలతోపాటు దాదాపు 5 వేలమంది ఇతర నాయకులు, కార్యకర్తల ఖాతాలు బ్లాక్ అయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. మోదీజీ ఇంకెంత భయపడతారంటూ ఎద్దేవా చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది, ప్రజల ఆకాంక్షను కేవలం సత్యం, అహింస తోనే సాధించిందనీ, అప్పుడూ గెలిచాం, మళ్లీ గెలిచి తీరుతాం అంటూ కాంగ్రెస్ తన ఇన్‌స్టా పేజీ పోస్ట్‌లో పేర్కొంది. ప్రజలకోసం పనిచేస్తున్న తమను ఇలాంటి చర్యలు ఏమాత్రం అడ్డుకోలేవంటూ ట్విటర్ ఇండియాకు సవాల్ విసిరింది.

సుప్రీం చేసిన పనే కాంగ్రెస్ చేస్తే..
ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్ బాధిత బాలిక, తలిదండ్రుల ఫోటోలను షేర్ చేసిననేపథ్యంలో రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది. మరోవైపు బాధితుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ బాలల హక్కుల సంఘం రాహుల్‌పై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతలు షేర్ చేసినటువంటి ఫొటోలనే సుప్రీంకోర్టు కమిషన్ షేర్ చేసినా ట్విటర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రమే పక్షపాతంగా వ్యవహరించడం వివాదాస్పదమైంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications