ప్రధాని గొప్ప నటుడు, సరిలేరు ఆయనకు ఎవ్వరు CryPMPayCM, దూల్ దూల్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతున్నాయి. కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో బీజేపీ. కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిసోసుకుంటున్నారు. ఇదే సమయంలో CryPMPayCM పేరుతో వ్యంగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాతో వెరైటీగా, వ్యంగంగా ప్రచారం మొదలు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

CryPMPayCM ట్యాగ్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో ఆడుకుంటున్నారు. ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ఇప్పటి వరకు 91 సార్లు దూషించి తనను ఎంతో భాదపెట్టారని విచారం వ్యక్తం చేశారు.

 bommaimodi-

కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను ఎంత దూషించినా, ద్వేషించినా తాను ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రతిపక్షాలు విమర్శినంత మాత్రానా నేను చేసిన మంచి పనులను ప్రజలు మరిచిపోరని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలను ఆస్త్రంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మరుసటి రోజే కౌంటర్ మొదలుపెట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ చాలా గొప్ప నటుడు అని, ఆయన ముందు మహాహహ నటులు అంతా బలాదూర్, దూల్ దూల్ అని వ్యంగంగా ట్విట్ చేసింది, నాను దేశ ప్రజలకు, కర్ణాటక ప్రజలుకు ఏం చేశాను అని బహిరంగ సభల్లో వివరించడానికి నోరురాని ప్రధాని నరేంద్ర మోదీ తనను కాంగ్రెస్ పార్టీ నాయకులు దూషిస్తున్నారని ముసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవ చేస్తోంది.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటకలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ బాగా నటిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవ చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ CryPMPayCM ట్విట్టర్ లో బీజేపీ నాయకులకు కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో కర్ణాటక సీఎం పేరుతో PayCM పేరుతో ఓ పోస్టర్ తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా హంగామా చేశారు.

కర్ణాటకలో ఎక్కడంటే అక్కడ PayCM పోస్టర్లు అతికించడం కలకలం రేపింది. కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వం ఉందని ఆరోపిస్తు గత ఏడాది కాంగ్రెస్ పార్టీ PayCM పేరుతో చేసిన హంగామా అంతా ఇంతకాదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఒక అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని లక్షంగా చేసుకుని CryPMPayCM వ్యంగంగా ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+