అయినా.. మీరు నరేంద్రమోడీగా.. మోసపోరులే?
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీకి పూర్వ వైభవం నింపేందుకు 'భారత్ జోడో యాత్ర' పేరుతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ యాత్ర గురించి చేసిన విమర్శలకు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. గతంలో రాహుల్‌గాంధీని ఉద్దేశించి హిమంత చేసిన ట్వీట్‌ను ప్రస్తావించింది. అలా చేస్తూనే ప్రధానమంత్రి మోడీకి జాగ్రత్తలు కూడా చెప్పింది.
జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌పై హిమంత పేరడీ వీడియోను షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సరైన సమయంలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు. అప్పుడు తామంతా ఆయన్ను కలవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవల్సి ఉంటుందని ట్వీట్ చేశారు. దాన్ని ఆ పార్టీ ఇప్పుడు రీ ట్వీట్ చేసింది.
Dear @narendramodi ji
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 9, 2022
Whom @himantabiswa cheating?
His tracked record shows ..
beware of him .
I know you won’t allow him to cheat .
Regards pic.twitter.com/3IkCAthfkN
శర్మ ఎవరిని మోసం చేస్తున్నారు మోడీజీ.. అతనితో జాగ్రత్తగా ఉండండి.. అయినా అతను మోసం చేసేందుకు మీరు అవకాశం ఇవ్వరులే అని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ స్పందించారు. రాహుల్ గాంధీని తప్పుపడుతూ శర్మ 2015లో కాంగ్రెస్ పార్టీని వీడారు. తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కాంగ్రెస్‌కు పూర్వవైభవం సిద్ధించేలా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమై కశ్మీర్ లో ముగిసే ఈ యాత్ర ఆరునెలలపాటు 12 రాష్ట్రాల మీదగా సాగుతుంది. ప్రతిరోజు 25 కిలోమీటర్లు నడిచేలా ప్రణాళిక రూపొందించారు. పాదయాత్రలో కవర్ చేయని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక బృందం పర్యటించే వీలుంది. పాదయాత్రలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. వాటికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారు.












Click it and Unblock the Notifications