పంజాబ్‌లో పాగా వేసిన కాంగ్రెస్!.. ఆప్‌కు భారీ దెబ్బ
ఇప్పటిదాకా వెలువడుతున్న ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పంజాబ్ లో కాంగ్రెస్ దాదాపుగా పాగా వేసినట్లుగానే కనిపిస్తోంది.
చంఢీఘడ్: పంజాబ్‌లో ఆప్ హవా కొనసాగుతుందని చాలామంది భావించినప్పటికీ.. ఆఖరికి శిరోమణి అకాలీదళ్ కు పోటీ ఇవ్వడంలో మాత్రమే ఆప్ సఫలమైంది. కాంగ్రెస్ దూకుడుకు ఆప్ కళ్లెం వేయలేక చతికిలపడిపోయింది.
ఇప్పటిదాకా వెలువడుతున్న ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పంజాబ్ లో కాంగ్రెస్ దాదాపుగా పాగా వేసినట్లుగానే కనిపిస్తోంది. ఆప్ ప్రధాన అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ సైతం వెనుకంజలో కొనసాగుతుండటం పార్టీ అంచనాలను తలకిందులు చేసింది.

బీజేపీని వీడి నవజ్యోత్ సింగ్ సిద్దూ కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చినట్టయింది. సిద్దూ చేరికతో కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహంతో పాటు, ఆ పార్టీపై జనాల్లోకి సానుకూల సంకేతాలు వెళ్లాయి. ప్రస్తుతం ఆప్-24, కాంగ్రెస్-54, శిరోమణి అకాలీదళ్-27, ఇతరులు-2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు.












Click it and Unblock the Notifications