యూపీలో కాంగ్రెస్ ఒంటరి పోరే- 403 సీట్లలోనూ పోటీ-ప్రియాంక గాంధీ ప్రకటన

2024లో సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు 403 అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుదని యూపీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు.

2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని 403 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎన్నికల పోరులో విజయం సాధిస్తుందని పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఆమె, 2017లో ఉన్నావ్ రేప్ కేసు, హత్రాస్ గ్యాంగ్‌రేప్-మర్డర్ కేసుల్లో కూడా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (ఎస్పీ) నాయకులు ఎక్కడా కనిపించలేదని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే ప్రజల కోసం పోరాడుతోందని అన్నారు.

congress to contest alone in all 403 seats in net years uttar pradesh polls

యూపీలోని బులంద్ షహర్ లో ఉన్న అనూప్‌షహర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీప్రతిజ్ఞ సమ్మేళన్ - లక్ష్య 2022లో పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ... పార్టీకి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. దీనిని "డూ-ఆర్-డై" పరిస్ధితిగా ఆమె అభివర్ణించారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారానే ఎన్నికల పోటీలో విజయం సాధించగలమని, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.
సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల‌ని, పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నింటిని వివిధ సోష‌ల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేయాలని ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.

బీజేపీ నేతలు దేశ స్వాతంత్ర్యం కోసం రక్తం, చెమట చిందించలేదని, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బీఆర్ అంబేద్కర్ వంటి నాయకులు మాత్రమే స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించారని ప్రియాంక గుర్తు చేశారు. కాంగ్రెస్ అభివృద్ధిని తీసుకురావడమే కాకుండా సోదరభావాన్ని, సామరస్యాన్ని పెంపొందించిందని ప్రియాంక గాంధీ అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు. అయితే, గత ఏడేళ్లలో, బిజెపి ప్రభుత్వం కాపలాను తీసుకున్న చర్యలతో పెట్రో ధరలు లీటరుకు రూ.100 వరకు పెరిగాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+