వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై పోటీ: సచిన్ వైపు చూపు, నో చెప్పిన మాస్టర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వారణాసి నుండి ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెసు పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ వైపు కాంగ్రెసు పార్టీ అధిష్టానం దృష్టి సారించిందంటున్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ వారణాసితో పాటు వడోదర లోకసభ స్థానాల నుండి పోటీ చేయనున్నారు. వారణాసిలో ఆయనను ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెసు వేట ప్రారంభించింది. సమాచారం మేరకు... అధిష్టానం దృష్టి రాజ్యసభ సభ్యుడు అయిన సచిన్ పైన పడింది.

Congress tried to rope in Sachin Tendulkar to contest against Modi

ప్రజాకర్షణలో మోడీకి సచిన్ ఏమాత్రం తీసిపోడన్నది కాంగ్రెస్ వర్గాల భావన అంటున్నారు. అందుకే వారణాసి నుండి పోటీకి దింపే విషయమై సచిన్‌తో కాంగ్రెసు పెద్దలు సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. అయితే, మోడీపై పోటీకి సచిన్ విముఖత ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సచిన్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు.

వారణాసిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి 2004లో గెలుపొందారు. రాజేష్ కుమార్ మిశ్రా అప్పుడు గెలిచారు. అయితే, 2009లో బిజెపి నేత మురళీ మనోహర్ ఈ స్థానంలో గెలిచారు. కాగా, మోడీ పైన పోటీ చేసేందుకు తాను సిద్ధమని కాంగ్రెసు సీనియర్ నేత ఆనంద్ శర్మ బుధవారం చెప్పారు. పార్టీ కోరుకుంటే తాను ఇప్పుడే లగేజీ సదురుకొని వారణాసి బయలుదేరుతానని చెప్పారు.

English summary
Congress' hunt for a suitable celebrity candidate from Varanasi appears to have come to an end. According to reports, the party also contacted cricketing idol Sachin Tendulkar, who is the party's Rajya Sabha member, but he refused to bite the bait.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X