కొత్త నోట్లు: బ్యాంకు ముందు క్యూలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారో ప్రధాని నరేంద్ర మోడీకి ఏమి తెలుసు ? ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి తాను ఇక్కడి వచ్చానని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీలోని పార్లమెంట్ రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ దగ్గరకు వెళ్లారు. తరువాత సామాన్య ప్రజలతో పాటు రూ. 500, రూ.1,000 నోట్లు మార్చుకోవడానికి క్యూలో నిలబడ్డారు. విషయం గుర్తించిన సామాన్య ప్రజలు ముందు కు వెళ్లాలని రాహుల్ కు మనవి చేశారు.
Gareeb vyakti ko kasht ho raha hai, mai yahan Rs 4000 badalne aaya hoon: Congress VP Rahul Gandhi pic.twitter.com/gnyH1Xtetc
— ANI (@ANI_news) November 11, 2016
అయితే అందుకు రాహుల్ గాంధీ అంగీకరించలేదు. మీతో పాటు నేను క్యూలో వస్తానని నిలబడ్డారు. ప్రజలు సమస్యలు తీర్చడానికి బ్యాంకు సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారని అక్కడ ఉన్న ప్రజలు రాహుల్ గాంధీకి చెప్పారు.
మీ సమస్యలు తెలుసుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని రాహుల్ గాంధీ క్యూలో ఉన్న వారికి చెప్పారు. నా దగ్గర రూ. 4,000 పాత నోట్లు ఉన్నాయి. ఆ డబ్బు బ్యాంకులో ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని రాహుల్ గాంధీ మీడియాకు చెప్పారు.
Kya apko yaha koi suit boot pehne dikh raha hai, yaha par sab aam log hai jo pareshan hai, par Modi ji ko isse kya farak padta hai: R Gandhi pic.twitter.com/fF8Y55pwkD
— ANI (@ANI_news) November 11, 2016
రాహుల్ గాంధీ ఆకస్మికంగా అక్కడికి రావడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. రాహుల్ గాంధీ రాజకీయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు బీజేపీ నాయకులు మండిపడ్డారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications