జస్ట్ మిస్: తప్పించుకున్న రాహుల్ గాంధీ
ఆగ్రా: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాహుల్ గాంధీ కిసాన్ ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అగ్రసేన్ విగ్రహానికి పూలమాల వెయ్యడానికి వెళ్లారు.
పూలమాల వేస్తున్నప్పుడు పైన విధ్యుత్ తీగ రాహుల్ తలకు తగిలింది. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ తల కిందకు వంచేశారు. వెనక్కి జరిగి తాను క్షేమంగానే ఉన్నానని కార్యకర్తలకు చెప్పారు. అంతకు ముందే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షాక్ కు గురైనారు.

తరువాత రాహుల్ గాంధీ క్షేమం అని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. పక్కనే ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ రాహుల్ సార్ మీరు క్షేమమే కదా అని ప్రశ్నించారు. అవునండి మీరు నాకు ఇక్కడ కరెంట్ షాక్ ఇచ్చారు కదా అంటూ జోకులు వేస్తూ అక్కడి నుంచి బయలుదేరారు.












Click it and Unblock the Notifications