కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకను విభజిస్తుంది, అది దానినైజాం, మోదీ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విభజించు పాలించు అనే సూత్రాన్ని పదేపదే పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకను విభజించడానికి ప్రయత్నిస్తున్నదని, అది ఆ పార్టీ నైజాం అని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం కర్ణాటకలోని మైసూరు సమీపంలోని దక్షిణ కాశిగా ప్రసిద్ది చెందిన నంజనగూడు దగ్గర ఉన్న ఎలచేనహళ్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మొదట చాముండేశ్వరి దేవి, నంజుండేశ్వరస్వామి, మలే మహదేశ్వరస్వామి, సుత్తూరు మఠం స్వామిజీ, ఆదిచుంచునగిరి స్వామిజీని ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు.

 Congress

అనంతరం మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని. ప్రపంచంలో కర్ణాటక నెంబర్ వన్ కావాలని కోరుకుంటున్న అందరూ బీజేపీకి ఓటు వెయ్యాలని, తాను కర్ణాటకను నెంబర్ వన్ చేస్తానని మాట ఇస్తున్నానని, అందులో ఎలాంటి డౌట్ లేదని మోదీ అన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ మీద ప్రజలకు నమ్మకం ఉందని, కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకు రెండు రకాలుగా లాభాలు ఉంటాయని, రెండు విధాల ప్రజలకు లబ్దిచేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే భారతదేశం ఆర్థికంగా ఐదవ స్థానంలో ఉందని, భారత్ లో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

మొబైల్ ఫోన్లు తయారు చెయ్యడంలో దేశంలోనే కర్ణాటక రెండో స్థానంలో ఉందని, పలు కంపెనీలు భారత్ లో, కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అది సాధ్యం అవుతుందని, కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలు వస్తే ఆకంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించరని ప్రధాని మోదీ అన్నారు.

 Congress

దేశంలో కర్ణాటక చాలా గుర్తింపు తెచ్చుకుంటున్నదని ,ఇలాంటి సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అధికారంలోకి వస్తే ఆరెండు పార్టీల నాయకులు లూటీ చేస్తారని, తరువాత ప్రజలకు ఏమి మిగలదని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలకు గ్యారెంటీ లేదని, మోసం అనే పదానికి కాంగ్రెస్ పార్టీ నిదర్శనం అని చరిత్ర చెబుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప, బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే చాలా మంచి పనులు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఢిల్లీలో 100 పైసల నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు 85 పైసలు తినేసి 15 పైసలు ప్రజలకు ఇస్తున్నారని, ఈ మాట తాను చెప్పలేదని, రాజీవ్ గాంధీ గతంలో చెప్పిన మాటను తాను గుర్తు చేస్తున్నానని మోదీ అన్నారు.

కర్ణాటక నెంబర్ కావాలని అనేకునే కన్నడిగులు బీజేపీకి ఓటు వెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ప్రజలకు మనవి చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసిన కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలతో ఇప్పుడు కర్ణాటక ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన విషయం గురించి మరోసారి చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+