బీజేపీకి షాక్: చిత్రకూట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు

Posted By:
Subscribe to Oneindia Telugu

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి నీలాంశు చతుర్వేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శంకర్ దయాల్ త్రిపాఠిపై విజయం సాధించారు.

ఈ నెల 9వ తేదీన చిత్రకూట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 65 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక నిర్వహించారు.

Congress Wins Chitrakoot Assembly Bypoll in Madhya Pradesh

ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు సాధించారు. ఉప ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కానీ ప్రధాన పోటీ మాత్రం గెలిచిన కాంగ్రెస్ నేత నీలాంశు, ఓడిన బీజేపీ నేత త్రిపాఠి మధ్యనే సాగింది.

కాగా, మృతి చెందిన ప్రేమ్ సింగ్ గతంలో 1998, 2003, 2013 ఎన్నికల్లో విజయం సాధించారు. 2008లో మాత్రం బీజేపీకి చెందిన సురేంద్ర సింగ్ చేతిలో గహర్వార్ నియోజకవర్గంలో ఓడిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress candidate Nilanshu Chaturvedi won over BJP's Shankar Dayal Tripathi in Chitrakoot Assembly by-election in Madhya Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి