వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనూహ్య నిర్ణయం: పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ భేటీపై

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో భూకంపాన్నిపుట్టించాయి. అయిదింట్లో ఏ ఒక్క చోట కూడా నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్‌ను సైతం కోల్పోవడం.. కాంగ్రెస్ పార్టీ పతనానికి పరాకాష్ఠ. గోవా, ఉత్తరాఖండ్‌లల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసినా వాస్తవ ఫలితాలు దానికి భిన్నంగా వెలువడ్డాయి.

ఒక వెలుగు వెలిగిన ఉత్తర ప్రదేశ్‌లో హస్తం పార్టీకి దక్కినవి రెండంటే రెండు స్థానాలే. పార్టీ తురుఫుముక్కగా భావించిన ప్రియాంకాగాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నప్పటికీ- అది ఏ మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సీట్ల సంఖ్యను మరింత తగ్గించింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ ఛరిష్మా మసక బారిందనడానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారాయి. ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలను సమీక్షించుకోనుంది అధిష్ఠానం.

ఫలితాలపై చర్చించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవ్వాళ సమావేశం కావాలని తొలుత నిర్ణయించుకుంది. ఈ సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని షెడ్యూల్ చేసింది. అనూహ్యంగా దీన్ని సోమవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాన్ని రీషెడ్యూల్ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామాలు చేస్తారంటూ వార్తలు వెలువడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం వాయిదా పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Congress Working Committee meeting on Sunday has been rescheduled for March 14

సీడబ్ల్యూసీ సమవేశాన్ని వాయిదా వేయడానికి గల కారణాలను పార్టీ వర్గాలు వివరించాయి. ఈ ఉదయం 10 గంటలకు పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్‌ సమావేశం ఏర్పాటు కానున్నందున సీడబ్ల్యూసీ భేటీని వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోయే 2024 వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని, సమయం సరిపోదనే ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు వివరణ ఇచ్చాయి.

సోనియా గాంధీ నివాసం నంబర్ 10, జన్‌పథ్‌‌లో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ఏర్పాటు కావాల్సి ఉండగా దీన్ని కాస్త ముందుకు జరిపింది పార్టీ అధిష్ఠానం. 10 గంటలకే సమావేశమౌతుంది. సాయంత్రం వరకూ కొనసాగుతుంది. కాగా- సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల రాజీనామాలపై కాంగ్రెస్ స్పందించింది. అది తప్పుడు ప్రచారమని పార్టీ సీనియర్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా కొట్టిపారేశారు.

English summary
The Congress Working Committee meeting on Sunday has been rescheduled. The meeting will now be held on Monday, 10 am to discuss the outcome of the assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X