వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు: కాంగ్రెస్ లేఖ, అసలేం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Elections 2019 : రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు..!! || Oneindia Telugu

న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఏ)కు లేఖ రాశారు. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు జైరామ్ రమేష్, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలాలు ఈ లేఖ రాశారు. దీనిపై వారి సంతకాలు ఉన్నాయి. అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భద్రతలోపాలు కనిపించాయన్నారు.

లిస్ట్‌లో పేరు లేదు: ఓటేసేందుకు విదేశాల నుంచి వస్తే అపోలో చీఫ్ కూతురుకు షాక్లిస్ట్‌లో పేరు లేదు: ఓటేసేందుకు విదేశాల నుంచి వస్తే అపోలో చీఫ్ కూతురుకు షాక్

రాహుల్ గాంధీ తలపై ఏడుసార్లు లేజర్ పాయింట్

రాహుల్ గాంధీ తలపై ఏడుసార్లు లేజర్ పాయింట్

రాహుల్ గాంధీ అమేథీకి వచ్చి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సమయంలో ఏడుసార్లు ఆయన తలపై గ్రీన్ లేజర్ పాయింట్ చేసినట్లు కాంగ్రెస్ నేతలు తమ లేఖలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతున్న క్లిప్‌ను చూసినప్పుడు కనీసం ఏడుసార్లు ఆయన తలపై లేజర్ పాయింట్ కనిపించిందన్నారు. ఆ లేజర్ కాంతి ఒక స్పైనర్ తుపాకీది కావొచ్చునని పేర్కొన్నారు.

 పెన్ డ్రైవ్‌లో వీడియో

పెన్ డ్రైవ్‌లో వీడియో

ఆ వీడియోని చూసిన మాజీ భద్రతా సిబ్బంది సహా వివిధ వ్యక్తులు అలాంటి లేజర్ ఏదైనా ఆయుధం నుంచి వెలువడి ఉండవచ్చునని, అది స్పైపర్ గన్‌ది కావొచ్చునని చెప్పారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాహుల్ గాంధీ నిన్న (ఏప్రిల్ 10వ తేదీ) నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఆ లేజర్ కాంతి ఆయనకు గురిపెట్టినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రాహుల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వీడియో ఉన్న ఓ పెన్ డ్రైవ్‌ని కూడా ఆ లేఖతో జతపరిచింది. లేజర్ కాంతి రాహుల్ గాంధీ నుదిటిపై గురిపెట్టి ఉందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు

రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు

ఇప్పటికే మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తీవ్రవాద హత్యకు గురయ్యారని, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాహుల్ భద్రతపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.

అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?

దీనిపై సదరు మంత్రిత్వ శాఖ స్పందించింది. రాహుల్ గాంధీ సెక్యూరిటీ అంశంపై తమకు ఎలాంటి లేఖ అందలేదని పేర్కొంది. అదే సమయంలో గ్రీన్ లేజర్ లైట్ అంశంపై ఏం జరిగిందో తెలుసుకోవాలని డైరెక్టర్ (ఎస్పీజీ)ని ఆదేశించింది. దీనిపై డైరెక్టర్ (ఎస్పీజీ) కూడా వివరణ ఇచ్చింది. ఆ గ్రీన్ లైట్ ఓ ఏఐసీసీ ఫోటోగ్రాఫర్‌కు చెందిన మొబైల్ ఫోన్ నుంచి వచ్చిన కాంతి అని పేర్కొంది.

English summary
The Congress on Thursday wrote to the Ministry of Home Affairs (MHA) alleging 'grave' threat to its president Rahul Gandhi's life. In a letter, three Congress leaders said that a laser was pointed at Rahul during his interaction with journalists after filing nomination for the Amethi Lok Sabha constituency on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X