Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Arvind Kejriwal:జైలు నుంచే కేజ్రీవాల్ రాష్ట్రాన్ని పాలించొచ్చా.. చట్టం ఏం చెబుతోంది..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టొరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నోటీసులను లెక్క చేయకపోవడంతో ఎట్టకేలకు కోర్టు జోక్యం చేసుకోవడంతో అరవింద్ కేజీవ్రాల్‌ను విచారణ సంస్థ అరెస్టు చేసింది. ఇదిలా ఉంటే ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు అరెస్టు కావడంలో కేజ్రీవాల్ రెండో వ్యక్తి. అది కూడా రెండు నెలల సమయంలోనే. అంతకుముందు జార్ఖండ్ సీఎం 2024 జనవరి 31వ తేదీన అరెస్టు అయ్యారు. అయితే జైలుకు వెళ్లే ముందు ఆయన రాజీనామా చేయడంతో చంపాయ్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

2023 నవంబర్‌లో ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలోనే కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈడీ అరెస్టు చేసినంత మాత్రాన తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ కటకటాల వెనక నుంచే ప్రభుత్వాన్ని నడుపుతానని చెప్పుకొచ్చారు. అయితే అరెస్టు అయిన ముఖ్యమంత్రి జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపే అవకాశం ఉందా..?చట్టం ఏం చెబుతోంది..?

Constitutional Constraints Can Arvind Kejriwal Rule from Jail what the law says

అరెస్టు నుంచి రక్షణ..?

భారత రాష్ట్రపతి, రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు తాము పదవిలో ఉండగా అరెస్టు చేసి ఎలాంటి విచారణ చేపట్టరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 చెబుతోంది. వారు ఎలాంటి కోర్టులకు సమాధానం లేదా వివరణ ఇవ్వాల్సిన పనిలేదని ఈ అధికరణ సూచిస్తోంది. అయితే దేశాన్ని పాలించే ప్రధాన మంత్రి, రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రులకు ఈ అధికరణ వర్తించదు.రాజ్యాంగం ముందు లేదా చట్టం ముందు వీరంతా సమానమే.అయితే కేవలం అరెస్టుతోనే వారు ఆ పదవి నుంచి తప్పుకోవాలని కూడా రాజ్యాంగంలో లేదు.

కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన చేయొచ్చా..?

జైలు నుంచి పాలన సాగించడమంటే సాధ్యపడే విషయం కాదు. అయితే ఒక ముఖ్యమంత్రి అలా చేసే అధికారం లేదని చెబుతూ చట్టంలో ఎక్కడా లేదు. అయితే ఒక సీఎం ఏదైనా కేసులో నిందితుడిగా నిర్ధారణై శిక్ష పడితే ముఖ్యమంత్రి పదవికి అనర్హుడవుతారు. అయితే కేజ్రీవాల్ కేసులో ఇంకా చేసిన నేరం విచారణ దశలోనే ఉంది కాబట్టి, ఇంకా నిర్ధారణ కానందున ఆయన సీఎంగానే కొనసాగొచ్చు. ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి తాను నిర్వహిస్తున్న పదవి నుంచి అనర్హుడిగా ప్రకటించాలంటే రెండు నిబంధనలు 1951 ప్రజాప్రతినిధుల చట్టంలో పొందు పర్చారు. అసెంబ్లీ లేదా పార్లమెంటులో సంఖ్యాపరంగా కావాల్సినంత మద్దతు లేకపోవడం, లేదా ఆ వ్యక్తిపై లేక ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి అది విజయవంతమైతే ఆయా పదవుల నుంచి దిగిపోవాల్సి ఉంటుంది. అయితే కేజ్రీవాల్ విషయంలో జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టతరమే అవుతుంది. ఇప్పటికే తన సహచరులైన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు జైలులోనే ఉన్నారు. అయితే కేజ్రీవాల్‌కు సీఎం తప్ప ఎలాంటి పోర్టుఫోలియో లేదు.

Constitutional Constraints Can Arvind Kejriwal Rule from Jail what the law says

గతం ఏం చెబుతోంది..

గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు అరెస్టు అయ్యారు. అయితే వారంతా జైలుకు వెళ్లే ముందు తమ పదవులకు రాజీనామా చేసి మరొకరికి ఆ బాధ్యతను అప్పగించి వెళ్లారు. 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ దానా స్కామ్‌లో నిందితుడిగా నిర్ధారణ కావడంతో అరెస్టు అయ్యారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రీదేవిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 1996లో అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. అయితే 2014లో ఆమె నేరం రుజువుకావడం 4 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు. రాజీనామా చేసి తనకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వంను సీఎంగా చేశారు. ఇక ముఖ్యమంత్రులుగా సేవలందించి అరెస్టయిన వారిలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా, జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడ ఉన్నారు.

లెఫ్ట్‌నెంట్ జనరల్ కీలక పాత్ర

ఢిల్లీ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజలు ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రితో పాటు కేంద్రం ఎంపిక చేసిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కూడా సమానంగా ఉంటారు. సీఎంగా కేజ్రీవాల్ కొనసాగాలంటే ఆయనకు జైలు శిక్ష నుంచి ఊరట కలగాలి.లేదంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న సక్సేనా జోక్యం చేసుకుని ఢిల్లీకి ఉన్న ప్రత్యేక చట్టం అయిన ఆర్టికల్ 239AAను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయొచ్చు. సీఎంగా ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగించడం లేదా ప్రభుత్వం నడపడం కష్టతరమన్న కారణం చూపుతూ ఆ చట్టాన్ని రద్దు చేయాలని ఎల్జీ సక్సేనా రాష్ట్రపతిని కోరే అవకాశం ఉంది.

Constitutional Constraints Can Arvind Kejriwal Rule from Jail what the law says

చాలా సందర్భాల్లో అరెస్టు అయిన ముఖ్యమంత్రులు లేదా మంత్రులు తమకు బెయిల్ రాకపోవడంతో వారు బలవంతంగా వారి పదవులకు రాజీనామా చేశారు. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ 2023 జూన్‌లో అరెస్టు చేసింది. అరెస్టు అయ్యాక కూడా తాను మంత్రిగా ఎలా కొనసాగుతారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీంతో అరెస్టు అయిన 8 నెలలకు సెంథిల్ బాలాజీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇక కేజ్రీవాల్ కేబినెట్‌లో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సిసోడియా, సత్యేంద్ర జైన్‌లకు బెయిల్ లభించకపోవడంతో వారు వారి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఒక వేళ రాష్ట్రపతి పాలనంటూ ఢిల్లీలో వస్తే ఆ రాష్ట్రం పాలన నేరుగా కేంద్రం చేతిలోకి వెళుతుంది. ప్రస్తుత ఢిల్లీ ప్రభుత్వం 2025 ఫిబ్రవరి వరకు ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+